Smartron tbike Onex launched.. 100km range

Spread the love

టెక్నాలజీ కంపెనీ Smartron India బిజినెస్-టు-బిజినెస్ (B2B) సెగ్మెంట్ కోసం రూ.38,000 ధరతో సెకండ్ జ‌న‌రేష‌న్ ఇ-సైకిల్ Smartron tbike OneX ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

Smartron tbike Onex 100km range

మల్టీ-మాడ్యులర్, మల్టీ-పర్పస్, మల్టీ-యుటిలిటీ వెహికల్ గా రైడ్‌షేర్, డెలివరీ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని Smartron tbike వాహ‌నాన్ని రూపొందించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. బ్యాటరీ మార్పిడి, ఆన్-బోర్డ్ ఛార్జింగ్ ఎంపికలతో ఇది వ‌స్తుంది. ఈ సైకిల్ గరిష్టంగా 25 kmph వేగంతో వెళ్తుంది. ఒక సింగిల్ చార్జిపై సుమారు 100 km ప్ర‌యాణిస్తుంద‌ని Smartron ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ లాంచ్‌తో, కంపెనీ తన ప్రొడ‌క్ట్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు ఐదు t-bike మోడళ్లను కలిగి ఉందని తెలిపింది.

Smartron tbike OneX విడుద‌ల‌పై కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మహేష్ లింగారెడ్డి మాట్లాడుతూ.. ష‌మా సెకండ్ జ‌ర‌రేష‌న్ మ‌ల్టీ ప‌ర్ప‌స్ ఈబైక్ అయిన tbike oneX లాంచ్‌ను ప్రకటించినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు.

“ఇది అత్యంత విజయవంతమైన tbike One, One Proపై నిర్మించబడిందని తెలిపారు. tbike oneX రైడ్‌షేర్ మార్కెట్ కోసం రూపొందించబడినప్పటికీ, దీనిని జ‌న‌ర‌ల్ యూజ్‌, టూరిజం, ఇ-కామర్స్, ఈ-ఫార్మసీలు, ఇ-కిరాణా వస్తువుల ర‌వాణాకు ఉపయోగించ‌వ‌చ్చ‌ని తాము భావిస్తున్నామని తెలిపారు.

విదేశాలకు ఎగుమతి

కంపెనీ ఆఫ్రికా, UK/ఐర్లాండ్, భూటాన్, మెక్సికో తోపాటు అనేక దేశాలకు త‌మ ఉత్ప‌త్తుల‌ను ఎగుమతి చేయడం ప్రారంభించిందని ఆయన చెప్పారు.కాగా e bike పూర్తిగా భారతదేశంలో రూపొందించబడింది.

Smartron EV విభాగం మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ నిశాంత్ మాట్లాడుతూ.. “tbike OneX విభిన్న కార్గో అవసరాలకు అనుగుణంగా డిజైన్ సెన్సిబిలిటీలతో కలిపి సులభమైన రైడ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు.

Smartron India కంపెనీని 2014లో స్థాపించారు. ఇటీవల ఆఫ్రికా, UK/ఐర్లాండ్, భూటాన్, మెక్సికోలోని అనేక దేశాలకు తమ tbikeలను ఎగుమతి చేయడం ప్రారంభించారు. కొత్త ఇ-బైక్ OneX ‘భారతదేశంలోనే రూపొందించబడింది OneXలో మెగ్నీషియం అల్లాయ్ వీల్స్, పంక్చర్ ప్రూఫ్ టైర్లు, ఫ్రేమ్‌పై జీవితకాల వారంటీ ఉన్నాయి. అల్యూమినియం ఉపయోగించి ఫ్రేమ్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది తక్కువ బరువు, రస్ట్ ప్రూఫ్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది.

Smartron India ఇ-బైక్ OneXని ప్రారంభ ధర రూ. 38,000/- (GST మినహాయించి).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..