ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..
Electric Two-Wheeler Sales | ఎలక్ట్రిక్ వాహన విపణిలో గత సెప్టెంబర్ ఈవీ వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు విక్రయాలు జరగగా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు).
పడిపోతున్న ఓలా గ్రాఫ్
దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024 మొదటి ఏడు నెలల్లో సగటున 37,695 యూనిట్ల నెలవారీ విక్రయాలను నమోదు చేసిన ఈ మార్కెట్ లీడర్.. , ఆగస్టు నుంచి పతనం ప్రారంభమైంది. ఆగస్టులో (26,928 యూనిట్లు), సెప్టెంబర్‌లో (23,965 యూనిట్లు) బాగా పడిపోయింది. దీని ప్రకారం కంపెనీ జూన్‌లో 105 శాతం, జూలైలో 112 శాతం నుంచి ఇంకా ఆగస్టులో 46 శాతానికి, సెప్టెంబర్‌లో 29 శాతానికి తగ్గింది.Ola సెప్...