దేశ దేశవ్యాప్తంగా 380 EV chargers
17 నగరాల్లో ఏర్పాటు చేసిన EVI Technologies
EV chargers ఈవీ రంగం అభివృద్ధిలో చార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఎంతో కీలకం. మన దేశంలో ఇవి తగినన్ని లేకపోవడం ఈవీ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా అనేక సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ముందుకు వస్తున్నాయి.తాజాగా EVI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్(EVI Technologies) (EVIT) భారతదేశంలోని 17 నగరాల్లో 380 EV ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. 2017 జూన్ లో EVIT ని స్థాపించారు. ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.హైదరాబాద్ సహా 17 నగరాల్లో..EVI Technologies సంస్థ హైదరాబాద్, ఢిల్లీ-NCR, రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్...