
2025 Tata Punch EV: కొత్త కలర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన రేంజ్ – ధరలు & ఫీచర్లు
2025 Tata Punch EV Details : భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUV అయిన పంచ్ EV కి సంబంధించి టాటా మోటార్స్ రెండు అత్యంత కీలకమైన అప్‌డేట్స్ ను విడుదల చేసింది. అందులో రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. - ప్యూర్ గ్రే సూపర్నోవా కాపర్. ఫియర్‌లెస్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, డేటోనా గ్రే, సీవీడ్, ప్రిస్టైన్ వైట్‌తో సహా ఇప్పటికే ఉన్న కలర్ ఆప్షన్స్ కూడా కొనసాగుతున్నాయి.మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ దాని ఛార్జింగ్ సిస్టమ్. ఇది ఇప్పుడు వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Punch.ev ఇప్పుడు 1.2C రేటుతో ఛార్జ్ చేస్తుంది, దీని వలన కస్టమర్‌లు తమ EVని కేవలం 40 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలరు. 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 15 నిమిషాల్లో 90 కి.మీ. దూరాన్ని ప్రయాగనించగలరు.ఇక వాహనానికి ఇతర మార్పులు చేయలేదు.బ్యాటరీ ఎంపికలుటాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఎంపిక...