హీరో ఎలక్ట్రిక్ మళ్లీ ముందంజ
జూలై EV విక్రయాల టాప్
ఏథర్, ఓలా వెనుకబాటుప్రఖ్యాత ఈవీ తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric).. జూలై నెలలో ద్విచక్ర వాహన విక్రయాలలో తిరిగి అగ్రస్థానాన్ని పొందింది. మరోవైపు ఏథర్, ఓలా గణనీయమైన తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. మొత్తం మీద Electric vehicles మార్కెట్ గత నెల ఊపందుకుంటోంది. భారతదేశం అంతటా మొత్తం అమ్మకాలు రెండు రెట్లు పెరిగినట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..జూలై లో టూ-వీలర్ EV విక్రయాలు టాప్ 10 తయారీదారుల్లో Hero Electric దాని టాప్ పొషిజన్‌ను తిరిగి పొందగా, Ather Ola బడా సంస్థలు తమ విక్రయాల జాబితాలో గణనీయమైన తగ్గుదలని నమోదు చేసుకున్నాయి.
హీరో ఎలక్ట్రిక్ Hero Electric: గత కొన్ని నెలలుగా అమ్మకాలలో క్షీణత తర్వాత జూలైలో యథాస్థానాన్నితిరిగి పొందింది. కొన్ని నెలల క్రితం ఇది మూడవ స్థానానికి దిగజారింది. జూన్‌లో 6,504 EV...