Tag: Okinawa

Okinawa lite : రూ.75వేలకే  ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ & స్పెసిఫికేషన్స్ ఇవే..
E-scooters

Okinawa lite : రూ.75వేలకే ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ & స్పెసిఫికేషన్స్ ఇవే..

Okinawa lite : ఒకినోవవా కంపెనీ 2015లో ప్రారంభమైన ఒక భారతీయ కంపెనీ. వాహనదారులను గ్రీన్ మొబిలిటీ వైపు నడిపించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రూపొందించడంపై దృష్టి పెట్టింది. Okinawa స్మార్ట్, స్టైలిష్,  శక్తి-సమర్థవంతమైన వాహనాలను రూపొందించింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన Okinawa Lite Electric స్కూటర్ అన్ని వర్గాలను నుంచి ఆదరణ లభించింది. దాని సొగసైన డిజైన్, ఆకట్టుకునే  ఫీచర్‌లతో విద్యార్థులు.. తక్కువ దూర ప్రయాణాలు చేసేవారికి మంచి చాయిస్ అయింది. ఇది ఒక లో స్పీడ్స్కూటర్. దీనికిలైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. Okinawa Lite డిజైన్, లుక్స్ ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ దాని భవిష్యత్ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది గుండ్రని అంచులతో సొగసైన, ఆధునిక రూపాన్ని కలిగి ఉంటుంది. DRL ఫంక్షన్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్, సౌలభ్యం కోసం డిటాచబుల...
ఒకినావా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై extended warranty
EV Updates

ఒకినావా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై extended warranty

Okinawa extended warranty : ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొనాల‌నుకునేవారికి శుభ‌వార్త.. ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒకినోవా తాజాగా త‌మ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ (EWP)ని ప్రకటించింది. USAలోని న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయమైన Assurant వ్యాపార సేవల సంస్థ భాగస్వామ్యంతో ఈ కొత్త స్కీమ్‌ను ప్రకటించబడింది. నూత‌న వారంటీ పథకం కింద ట్రాక్షన్ మోటార్లు, కంట్రోలర్లు, DC-DC కన్వర్టర్లు, ఛార్జర్‌లు వంటి పవర్‌ట్రెయిన్ భాగాలు కవర్ చేయబడతాయి.ఒకినావా వైరింగ్ హార్నెస్‌లు, ఫ్రేమ్ అసెంబ్లీపై వారంటీని అందించే మొదటి కంపెనీగా అవతరించింది. బహుళ ప్రయోజనాల ద్వారా విక్రయాల అనంత‌రం వినియోగ‌దారుల‌కు వీలైన‌న్ని స‌దుపాయాల‌ను మెరుగుపరచడంతోపాటు దాని నాణ్యతా ప్రమాణాలకు పెద్ద‌పీట వేసేందుకు కంపెనీ నిర్ణ‌యించుకుంది.Okinawa extended warranty (రెండు సంవత్సరాల వరకు) కనీస ధర రూ.2,287 తో...
మార్చి 24న‌ Oki 90 electric scooter విడుద‌ల‌
E-scooters

మార్చి 24న‌ Oki 90 electric scooter విడుద‌ల‌

Oki 90 electric scooter : దేశంలో ఎలక్ట్రిక్ వాహ‌న రంగం శ‌ర‌వేగంగా దూసుకుపోతున్న త‌రుణంలో మార్కెట్‌లో అనేక కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్ప‌టికే ఉన్న బ‌డా ఈవీ కంపెనీలు స‌రికొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్నాయి. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను తయారీ కంపెనీ ఒకినావా ఆటోటెక్.. దేశీయ మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. మార్చి 24న అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయ‌లేదు. కానీ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Oki 90 పేరుతో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్చి 24, 2022న విడుద‌ల చేయ‌నున్నారు.ఒకినావా నుండి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడ‌ల్‌ను మొద‌ట టెస్టింగ్ రైడ్ సమయంలో గుర్తించారు. దాని తర్వాత త్వరలో విడుదల చేయబో...
Okinawa Autotech భారీ ఈవీ ప్లాంట్
EV Updates

Okinawa Autotech భారీ ఈవీ ప్లాంట్

సంవ‌త్స‌రానికి 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి మూడేళ్ల‌లో 1 మిలియన్ EV ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం  భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీల్లో ఒకటైన ఒకినావా ఆటోటెక్ (Okinawa Autotech) ఇటీవ‌ల‌ రాజస్థాన్‌లో తన రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (EV ) తయారీ కర్మాగారాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తన కొత్త తయారీ యూనిట్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అభివృద్ధి చేయడానికి అత్యుత్తమ యంత్రాలతో కొత్త ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఒకినావా పేర్కొంది. ఇది ప్రస్తుతం ఈ ప‌రిశ్ర‌మ 3 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.కంపెనీ చెబుతున్న‌దాని ప్రకారం.. ఈ ప‌రిశ్ర‌మ‌లో Oki90 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌తో సహా రాబోయే కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను అభివృద్ధి చేయనున్నారు. భారతదేశంలో ఒకినావా తన ప...
Okinawa ఈవీలకు భ‌లే డిమాండ్‌
E-scooters

Okinawa ఈవీలకు భ‌లే డిమాండ్‌

Okinawa వాహ‌నాల అమ్మ‌కాల్లో వృద్ధి Q1 FY21 లో ఒకినావా 15,000+ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్ర‌య‌యాలుపెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతుండ‌డంతో వినియోగ‌దారులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మ‌ళ్లుతున్నారు. ఫ‌లితంగా మార్కెట్‌లో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని నెల‌ల క్రితం కేంద్ర‌ప్ర‌భుత్వం ఫేమ్‌-2 స్కీం కింద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై స‌బ్సిడీని పెంచ‌డం కూడా ఈవీ అమ్మ‌కాల వృద్ధికి ఊత‌మిచ్చిన‌ట్ల‌యింది. అయితే Okinawa ఆటోటెక్ 2021 ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో అమ్మ‌కాలు పెరిగిన‌ట్లు కంపెనీ పేర్కొంది. Q1 FY21 కోసం కంపెనీ తన విక్ర‌యాల‌ను వెల్ల‌డించింది. ఈ కొద్ది కాలంలోనే ఒకినావా దేశంలో 15,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. వివ‌రంగా చెప్పాలంటే ఒకినావా కంపెనీ ఏప్రిల్‌లో 4,467 యూనిట్లు, మేలో 5,649 యూనిట్లు, ఇక‌ జూన్ 2021 లో అత్యధికంగా 5,860 యూనిట్లు విక్రయించింది. ఒకినావా భారతదేశంలోని కర్ణాటక,...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..