చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు
జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధితో ఆఫర్
బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, 2W సెగ్మెంట్‌లో S1 స్కూటర్ పై ఫైనాన్సింగ్ ఆఫర్లను అందిస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. కస్టమర్లు ఇప్పుడు అతి తక్కువ నెలవారీ EMIలతో, జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్ కి యజమాని అవ్వవచ్చు.ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ: “మార్కెట్ లీడర్‌గా, మేము ప్రముఖ ఫైనాన్సింగ్ భాగస్వాములతో ఒప్పదందాలను ఏర్పరచుకున్నాము. టైర్ 1 లోనే కాకుండా టైర్ 2, 3 నగరాల్లో కూడా అత్యంత లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తున్నాము. భారతదేశం EV 2W స్వీకరణకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మా ఫైనాన్సింగ్ ఆఫర్‌లు పరి...