ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్లాంట్
Omega Seiki Mobility కర్ణాటకలో ఏర్పాటు చేస్తోంది..
ఫరీదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) కర్ణాటకలో USD 250 మిలియన్ల (సుమారు రూ. 1,900 కోట్లు) పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ( world's largest electric three-wheeler plant ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.250 ఎకరాల స్థలంలో మూడు దశల్లో ఈ ప్లాంటును నిర్మించనున్నారు. ఏటా ఒక మిలియన్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ మెగా ఫ్యాక్టరీ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా ఉత్పత్తిని ప్రారంభిస్తుందని Omega Seiki Mobility (OSM ) తెలిపింది. ఈ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కంపెనీ ఈక్విటీ. డెట్ ద్వారా మూలధనాన్ని కూడా సేకరిస్తుంది.త్వరలో ప్యాసింజర్ త్రీ వీలర్
కొత్త మెగా ఫ్యాక్టరీ స...