PM Kisan Scheme | రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ 18 విడత డబ్బులు రూ.2000 వచ్చేశాయ్..
18వ విడత కింద 9.4 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు పంపిణీ
PM Kisan Scheme | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 18వ విడతను అక్టోబర్ 5, 2024న మహారాష్ట్రలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థికసాయం అందింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా 20,000 కోట్లు జమ అయ్యాయి.దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు), 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్‌లతో సహా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో చేరారు. విడుదల రోజును PM-కిసాన్ ఉత్సవ్ దివస్‌గా జరుపుకుంటూ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.24 ఫిబ్రవరి 2019న ప్రారంభించబడిన PM-KISAN పథకం భూమి కలిగి ఉన్న రైతులకు మూడు సమా...