13 రాష్ట్రాల్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఆగస్టు 15న విడుదలకు సిద్ధంSimple One electric scooter మొదటి విడతతో ఒకేసారి 13 రాష్ట్రాల్లో లాంచ్ చేయనున్నారు. ఈ స్టైలిష్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వినియోగదారులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇందులో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు. ఇది ఒకసారి చార్జి చేస్తే ఎకో మోడ్‌లో 240 కిమీలు ప్రయాణిస్తుందని ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. దీని టాప్ స్పీడ్100 kph. గంటకు 0-50 కిమీ వేగాన్ని 3.6 సెకన్లలోనే అందుకుంటుదని కంపెనీ పేర్కొంది.
ఆగస్టు 15న విడుదల
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ కొన్నేళ్ల క్రితమే Simple One electric scooter వివరాలు మరియు విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ తన ప్రధాన ఈ-స్కూటర్ సింపుల్ వన్‌ను ఆగస్టు 15 న బెంగళూరులో ఆవిష్కరించనుంది. ఈ కంపెనీ బ్రాండ్ బెంగుళూరు, చెన్నై మరియు హైదర...