Solar Rooftop system : రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ పై సబ్సిడీని 60 శాతానికి పెంచిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: మీరు ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ సిస్టం (Solar Rooftop system) పెట్టుకుందామని అనుకుంటున్నారా అయితే మీకొక గుడ్ న్యూస్.. రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని భారీగా పెంచేసింది. ప్రస్తుతం ప్రభుత్వం 40% సబ్సిడీని అందిస్తుండగా ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు సబ్సిడీని 60% వరకు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ శుక్రవారం తెలిపారు.రుణాల అవసరం లేకుండా సోలార్ సిస్టం (Solar Rooftop system)ను మరింత తక్కువ ఖర్చుతో అందించనుందని తెలిపారు. తద్వారా బలహీన వర్గాలకు చెందిన 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ప్రజలను సోలార్ విద్యుత్ దిశగా ప్రోత్సహించడమే ఈ సబ్సిడీ లక్ష్యం.మధ్యతరగతి ప్రజలు లోన్లు తీసుకోవడం క్లిష్టమైన సమస్య అందుకే మేము సబ్సిడీని పెంచాలనుకుం...