న్యూఢిల్లీ: మీరు ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ సిస్టం (Solar Rooftop system) పెట్టుకుందామని అనుకుంటున్నారా అయితే మీకొక గుడ్ న్యూస్.. రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని భారీగా పెంచేసింది. ప్రస్తుతం ప్రభుత్వం 40% సబ్సిడీని అందిస్తుండగా ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు సబ్సిడీని 60% వరకు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ శుక్రవారం తెలిపారు.
రుణాల అవసరం లేకుండా సోలార్ సిస్టం (Solar Rooftop system)ను మరింత తక్కువ ఖర్చుతో అందించనుందని తెలిపారు. తద్వారా బలహీన వర్గాలకు చెందిన 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ప్రజలను సోలార్ విద్యుత్ దిశగా ప్రోత్సహించడమే ఈ సబ్సిడీ లక్ష్యం.
మధ్యతరగతి ప్రజలు లోన్లు తీసుకోవడం క్లిష్టమైన సమస్య అందుకే మేము సబ్సిడీని పెంచాలనుకుంటున్నాము. బహుశా అది దాదాపు 60% ఉంటుంది. ప్రస్తుతం అది 40% ఉండగా, సబ్సిడీ పెంచడం వల్ల చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రతి రాష్ట్రం కోసం నియమించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSEలు) ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVs) ద్వారా ఈ పథకం అమలు చేయనున్నారు.
“దీనిని అమలు చేయడానికి వారు (CPSEలు) SPVలను ఏర్పాటు చేస్తారు. వారు రుణాలు తీసుకుంటారు. ఉత్పత్తి చేయబడే అదనపు యూనిట్, రుణాన్ని చెల్లించడానికి వెళ్తుంది, ”అని సింగ్ చెప్పారు, రుణ పరిమితి కాలం 10 సంవత్సరాల వరకు ఉంటుందని భావిస్తున్నారు.రుణాన్ని తిరిగి చెల్లించిన 10 సంవత్సరాల తర్వాత, రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంటికి బదిలీ చేయబడుతుంది, ఆపై అదనపు విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించవచ్చని ఆర్‌కె సింగ్ చెప్పారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..