2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్?
Tiago EV vs MG Comet EV : ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీ తీవ్రతరమైంది. టాటా మోటార్స్ ఇటీవల టియాగో EVని రిఫ్రెష్ చేసింది. ఈనేపథ్యంలో అప్ డేట్ చేసిన టాటా టియాగో EV , MG కామెట్ EV లో ఫీచర్లు, రేంజ్ లో తేడాలు ఏమిటి అనే విషయంలో కొనుగోలుదారుల్లో కొంత అయోమయం నెలకొంది.. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎలక్ట్రిక్ వాహనమో తెలుసుకునేందుకు ఈ కథనాన్ని చదవండి..టాటా టియాగో EV vs MG కామెట్ EV: స్పెసిఫికేషన్స్Tata Tiago EV vs MG Comet EV Specifications : Tiago EV రెండు బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది.. 19.2 kWh, 24 kWh. మిడిల్ రేంజ్ (MR) వెర్షన్ 60.3 bhp మరియు 110 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 6.2 సెకన్లలో 0 - 60 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇక లాంగ్ రేంజ్ (LR) 74 bhp మరియు 114 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. LR 5.7 సెకన్లలో 0 - 60 kmph వేగాన్ని అందుకుంటుంది.టాటా మ...