Home » Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

Spread the love

Tata Avinya: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో సమూల మార్పులు వచ్చాయి. హైటెక్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను సైతం తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బ్రిటీష్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM) మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఎలక్ట్రిఫైడ్‌ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫాం కొత్త ఎలక్ట్రిక్‌ కారును విడుదల ‌ చేయనుంది. టాటా అవిన్య (Tata Avinya) పేరుతో ఈ కారును రూపొందిస్తున్నట్లు టాటా సంస్థ అధికారికంగా ప్రకటించింది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ప్రభుత్వాలు ఊతమివ్వడం, ప్రజలు కూడా ఈవీలను ‌ వాడడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఈ రంగం వేగంగా దూసుకెళ్తోంది. దీంతో బడా ఆటో మొబైల్ సంస్థలు కూడా ఈవీలను తయారు చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా టాటా అనుబంధ సంస్థలైన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌, టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్ ‌ మొబిలిటీ సంయక్తంగా ఈ కారును రూపొందిస్తున్నాయి. ఈ ప్రీమియం కారు తయారీకి ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రిక్ డ్రైవ్ యూనిట్, బ్యాటరీ ప్యాక్, తయారీ పరిజ్ఞానంతో కూడిన రాయల్టీ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. టాటా మొటార్స్‌ తొలిసారిగా అవిన్య కాన్సెప్ట్‌ను 2022వ సంవత్సరంలో ప్రదర్శించింది. 2025 నాటికి ఈ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని అందించనున్నారు. ‘అవిన్య ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో సరికొత్త చరిత్రకు నాందీ పలుకుతుందని. ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు జేఎల్‌ఆర్‌, ఈఎం‌ఏ ప్లాట్‌ఫాంలు తమకు సహకరించడం చాలా ఆనందంగా ఉందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్‌ ప్రొడక్ట్ ఆఫీసర్‌ ఆనంద్‌ కులకర్ణి వెల్లడించారు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఈ కారు డిజైన్‌ విషయానికొస్తే.. అద్భుతంగా తీర్చిదిద్దారు. అత్యాధునిక ఫీచర్లతో, హైటెక్ హంగులతో రూపొందించారు. ఈ కారులో సైడ్‌ మిర్రర్లు ఉండవు, బయటి వ్యూన్‌ నేరుగా కారు డిస్‌ప్లేలోనే చూసుకోవచ్చు.. కారు వెనుక ‘T’ డిజైన్‌లో టెయిల్స్‌ ల్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 500 నుంచి 700 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఎస్‌యూవీ ని పోలిన విధంగా ఈ కారు పూర్తిస్థాయిలో వాయిస్‌ కంట్రోల్‌తో పనిచేస్తుంది. కారు స్టీరింగ్‌ను కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ధర, పూర్తిస్థాయి ఫీచర్ల వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో ఫాలో కండి

2 thoughts on “Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

  1. Tata AVINYA looks to be super innovative idea in the domestic market.But doubtful about its affordability, feel cost may be very high

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *