TATA Curvv EV | టాటా మోటార్స్ ఇటీవలే Curvvని ICE మరియు EV వేరియంట్లలో ఆవిష్కరించింది. దీనిని త్వరలో భారతదేశంలో ప్రారంభించేందుకు టాటామోటార్స్ సిద్ధమైంది. టాటా Curvv ఒక మిడిల్ రేంజ్ SUV. వెనుక వైపున కూపే డిజైన్‌ను కలిగి ఉంది. ఇది సెగ్మెంట్‌లోని మొదటి వాహనం.
టాటా మోటార్స్ Curvv కు సంబంధించిన పూర్తి వివరాలను దాని ఫీచర్లను ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు, అయినప్పటికీ, కార్ వాలే సంస్థ టాటా కర్వ్ ఈవీకి సంబంధించిన కొన్ని చిత్రాలను తీయగలిగింది. అలాగే దాని లక్షణాలను గురించిన వివరాలను కూడా పొందగలిగింది.
Tata Curvv EV: ఫీచర్లు..
టాటా Curvv EV కొత్త నెక్సాన్ వంటి ఇంటీరియర్ డిజైన్, స్టీరింగ్‌పై ప్రకాశవంతమైన టాటా లోగోతో కూడిన ఇంటీరియర్, ఫిజికల్ బటన్‌లకు బదులుగా టచ్ కంట్రోల్‌లు, రెండు-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ తోపాటు డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది.
ఫీచర్ల పరంగా, టాటా కర్వ్ ఈవీ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లతో 12-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో చూడవచ్చు. Curvv ఈవీ కి డిజిటల్ డాష్ , JBL ద్వారా తొమ్మిది-స్పీకర్ల ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
టాటా కార్లలో భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఉంటుందన్న విషయం అందిరికీ తెలిసిదే.. టాటా మల్టీ 5-స్టార్ సేఫ్టీ-రేటెడ్ వాహనాలతో గేమ్‌లో ముందుంది. టాటా కర్వ్ ఈవీ కి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, ADAS లెవల్ 2 కలిగి ఉంది. Tataa Curvv EV మార్కెట్ లోకి వస్తే MG ZS EV, Mahindta XUV400, BYD Atto 3, అలాగే రాబోయే హ్యుందాయ్ క్రెటా EV లకు పోటీగా ఉంటుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..