Tata Punch EV : టాటా పంచ్​ ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే.. లాంచ్​పై కీలక అప్డేట్

Spread the love

Tata Punch EV launch date : టాటా పంచ్​ ఈవీకి సంబంధించిన ముఖ్యమైన  వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 21న ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ని సంస్థ లాంచ్​ చేస్తుందని నివేదికలను బట్టి తెలుస్తోంది. వాస్తవానికి అక్టోబర్​లోనే ఈ మోడల్​ లాంచ్ కావాల్సి​ ఉండగా టియాగో ఈవీ పెండింగ్​ ఆర్డర్లను క్లియర్​ చేసిన తర్వాతే.. కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్​ చేయాలని సంస్థ భావించిందని సమాచారం. అందుకే పంచ్​ ఈవీని తీసుకురావడంలో కొంత ఆలస్యమైందని తెలుస్తోంది.

Tata Punch Ev ఫీచర్లు ఇవే..

Tata Punch EV ప్రస్తుతం టెస్ట్​ రన్​ దశలో ఉంది.. ఇప్పటికే చాలాసార్లు భారత్ లోని పలు రోడ్లపై కనిపించింది. టెర్ట్​ రన్​ ఫొటోలు ​ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు చూస్తుంటే.. నెక్సాన్​ ఈవీ మాదిరి4గానే ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ ఉన్నట్టు కనిపిస్తున్నది. ఐసీఈ ఇంజిన్​తో పోల్చుకుంటే.. ఈవీ​ మోడల్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ డిజైన్​లో కొన్ని మార్పులు చేసినట్టు భావించవచ్చు.  గ్రిల్​, బంపర్​, 5 స్పోక్​ అలాయ్​ వీల్స్​, రేర్​ వీల్​ డిస్క్​ బ్రేకులను సైతం మార్చినట్టు తెలుస్తోంది.

ఇక ఇటీవలి కాలంలో.. టాటా మోటార్స్ తమ వా హనాలకు కనెక్టెడ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​  ఇస్తోంది . అయితే టాటా పంచ్​ ఈవీలో కూడా దీనిని చూసే అవకాశం ఉందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.  మరోవైపు టాటా పంచ్​ ఈవీ ఇంటీరియర్​లో చాలా మార్పులో కనిపిస్తాయని సమాచారం.  భారీ 10.25 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టం​, 2 స్పోక్​ స్టీరింగ్​ వీల్​ వంటివి వస్తాయని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్​ పార్కింగ్​ బ్రేక్​ విత్​ ఆటోహోల్డ్​, ఆటోమెటిక్​ క్లైమెట్​ కంట్రోల్​, వైర్​లెస్​ ఛార్జర్​, సన్ ​రూఫ్​ వంటి ఫీచర్లు టాటా పంచ్ ఈవీలో చూడొచ్చు.

Tata Punch EV price: ఇక ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​, టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​, రేర్​ పార్కింగ్​ కెమెరా, ఏబీఎస్​ విత్​ ఈబీడీ, 6 ఎయిర్​బ్యాగ్స్​ వంటివి ఉంటాయని సమాచారం. కాగా ఈ టాటా పంచ్ ఈవీ ​ సిట్రోయెన్​ ఈసీ3కి గట్టిపోటీనిస్తుంది. అయితే.. డిసెంబర్​ 21న లాంచ్​ చేస్తున్న టాటా మోటార్స్.. ఈ విషయాన్ని​ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం నివేదికలు మాత్రమే ఆ తేదీ​ని చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..