Solar Energy | సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో జర్మన్‌ సాంకేతికత

Solar Energy | సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో జర్మన్‌ సాంకేతికత

Solar Energy | సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ రంగం (Renewable Energy)పై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు వెల్ల‌లించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం రాష్ట్రంలో విద్యుత్‌ రంగం బలోపేతం చేసేందుకు సోలార్‌ విద్యుదుత్పత్తితోపాటు, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని అన్నారు.
రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. వాటి లబ్ధిదారులకు సోలార్‌ విద్యుత్‌ అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతినెలా కచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని వివ‌రించారు. జర్మన్‌ ప్రతినిధులు సూచించిన సోలార్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని (Solar Technology) రాష్ట్రంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోగలం, తెలంగాణ విద్యుత్‌ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసుకోవడానికి జర్మన్‌ బృందం ప్రతిపాదనలు ఏ మేరకు ఉపయోగపడతాయో అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ను ఆదేశించారు. SPDCL,
సమావేశంలో ట్రాన్స్‌కో (Transco) సీఎం డి.కృష్ణ భాస్కర్‌, ఎస్పీడీసీఎల్‌ (NPDCL) సీఎండి ముషారఫ్‌ ఫారుఖి, రెడ్కో (REDCO) సీఎండీ అనిలా, జర్మన్‌ ప్రతినిధులు డాక్టర్‌ సెబాస్టియన్‌, డాక్టర్‌ రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.

 Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం  X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు