Solar Village

Solar Village | సోలార్ ప్యానెళ్లు పెడితే రూ. కోటి బహుమతి!

Spread the love
  • ములుగు జిల్లాలోని 8 గ్రామాలకు కేంద్రం బంపర్ ఆఫర్
  • అత్యధికంగా సోలార్ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసిన గ్రామానికి ‘మోడల్ సోలార్ విలేజ్’ బహుమతి

తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం భారీ న‌జ‌రానాను ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అందించింది. దేశంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘మోడల్ సోలార్ విలేజ్’ పైలట్ ప్రాజెక్టులలో భాగంగా తెలంగాణ‌లోని ములుగు జిల్లాలోని ఎనిమిది గ్రామాలను (Solar Village) కేంద్రంంలోని మోదీ ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కోటి బ‌హుమ‌తి అంద‌జేయ‌నున్నారు.

దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో థర్మ‌ల్ విద్యుత్ పై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై కేంద్రం ఫోక‌స్ చేసింది. ఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి మార్చ ఘర్ ముస్లి బిజిలీ యోజన్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశపెట్టి అమలు చేస్తోంది. తెలంగాణలో రెడ్కో (తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ‌లు చేస్తోంది. దీని కింద పైలట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండల కేంద్రాలతో పాటు పస్రా, చల్వాయి, మంగపేట, ఏటూరునాగారం, వెంటాపురం గ్రామాలను ఎంపిక చేశారు. గతేడాది మే నెలలో ఈ పథకంపై అధికారులు ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఫలితంగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైగా దరఖాస్తులు అందాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఈ పథకం కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ కూడా అందిస్తున్న‌ది.

ప్యానెల్ ఏర్పాటుకు ఇంటిపై కనీసం 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆసక్తి ఉన్న వినియోగదారులు pmsuryaghar.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత రెడ్కో, విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తారు.


 Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం  X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

More From Author

Solar Energy

Solar Energy | సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో జర్మన్‌ సాంకేతికత

New Agriculture Schemes 2025

రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025 Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్​ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ...