మూడు చ‌క్రాల Tunwal Three Wheeler Electric Scooter

Tunwal Storm ZX Advance 2
Spread the love
Tunwal Storm ZX Advance 2
Tunwal Storm ZX Advance 2

తున్వాల్ సంస్థ కొన్నాళ్ల కింద‌ట ప్ర‌యోగాత్మ‌కంగా  స్టోర్మ్ అడ్వాన్స్ 1, స్టోర్మ్ అడ్వాన్స్ 2 పేరుతో రెండు డబుల్ సీట్ Tunwal Three Wheeler Electric Scooter లను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది.  రెండు సీట్ల‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు సౌకర్యవంతంగా కూర్చోవ‌చ్చు. ఈ స్కూట‌ర్  దివ్యాంగుల కోసం ప్ర‌త్యేకంగా తయారు చేయబడింది.  ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడ‌డానికి సింగిల్ సీటర్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. డ్రైవర్ కోసం పెద్ద లెగ్ స్సేస్ ఉంటుంది.  ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది అలాగే వెనుక భాగంలో అడ్జ‌స్ట‌బుల్ సస్పెన్షన్‌తో అనుసంధానించబడి ఉంది. ఇందులో డ్రైవ‌ర్ సీటును అడ్జ‌స్ట్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించ‌డం విశేషం. డ్రైవ‌ర్‌కు అనుకూలంగా సీటు ఎత్తు ను కూడా పెంచుకోవ‌చ్చు. అలాగే ముందుకు వెనుక‌కూ జ‌రుపుకోవ‌చ్చు. ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డ్రైవర్‌కి ఆర్మ్‌రెస్ట్ మరియు బ్యాక్‌రెస్ట్‌ను అందిస్తుంది.

మూడు టైర్ల‌తోముచ్చ‌ట‌గా..

మొత్తం లోడ్ టైర్‌పై ఉంది కాబట్టి టైర్లు బలంగా ఉండాలి. అందుకే దీనిలో ప‌టిష్ట‌మైన‌ ట్యూబ్ లెస్ టైర్ల‌ను వినియోగించారు. ఇది రహదారిపై పట్టు ఉంటేలా చేస్తుంది ఆక‌ర్ష‌ణీయ‌మైన అలాయ్‌ వీల్ అదనపు బలాన్ని ఆక‌ట్ట‌కునే రూపాన్ని ఇస్తుంది.  ఫ్రంట్ టైర్‌లో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేకులను వినియోగించారు.

లెడ్ యాసిడ్‌, లిథియం అయాన్ బ్యాటరీ

Tunwal Three Wheeler Electric Scooter రెండు బ్యాటరీ ఆప్షన్ల‌లో అందుబాటులో ఉంది. లెడ్ యాసిడ్ బ్యాట‌రీ  ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. అలాగే లిథియం అయాన్ బ్య‌టరీ రెండు సంవత్సరాల వారంటీతో వస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 నుండి 7 గంటలు పడుతుంది,. ఒక యూనిట్ విద్యుత్తుతో  70 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.ఈ స్కూట‌ర్‌లోని ఛార్జింగ్ పాయింట్ బైక్ వెనుక సీటు ముందు ఉంటుంది.

Tunwal Storm ZX Advance 1
Tunwal Storm ZX Advance 1

రివ‌ర్స్ గేర్ ఆప్ష‌న్‌

తున్వాల్ డూయ‌ల్ సీటర్‌లో రివ‌ర్స్ గేర్ ఆప్ష‌న్ ఉంటుంది. దీనివ‌ల్ల స్కూట‌ర్‌పై కూర్చొని ఉండ‌గానే వెనుక‌కు న‌డిపిచ‌వ‌చ్చు. Tunwal Three Wheeler Electric Scooter మూడు టైర్లు క‌లిగి ఉన్నందున బైక్‌ను బ్యాలెన్స్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇది మూడు వేర్వేరు స్పీడ్ మోడ్‌లను కలిగి ఉంది.  ఇది మంచి రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. వివిధ రంగులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎబైక్ ARAI సర్టిఫికెట్ పొందింది. ఇది భద్రతతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఖ‌ర్చు త‌క్కువ‌.. లాభం ఎక్కువ

సంప్ర‌దాయ‌క పెట్రోల్ వాహ‌నాల‌తో పోలిస్తే దీని నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు చాలా త‌క్కువ  రెగ్యులర్ సర్వీసింగ్ మరియు ఆయిల్ మార్చుకునే అవ‌స‌రం లేదు.  Tunwal Three Wheeler Electric Scooter గంట‌కు 25కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది.  అలాగే సింగిల్ చార్జ్ పై 50కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌వ‌చ్చు.  త‌క్కువ వేగంతో ప్ర‌యాణించ‌డం వ‌ల్ల దీనికి ఎలాంటి రిజిస్ట్రేష‌న్‌, డ్రైవింగ్ లైసెన్సు, పొల్యూష‌న్ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేదు.

తున్వాల్ కంపెనీ గురించి సంక్షిప్తంగా..

భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ తున్వాల్ కంపెనీని  జె పి తున్వాల్ 2014లో నెల‌కొల్పారు. తున్వాల్ ఇ-బైక్ ప్రధాన కార్యాలయం, మరియు తయారీ యూనిట్ గుజరాత్ లోని గాంధీనగర్ గ్రీన్ సిటీ లో ఉంది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సంస్థ చా‌లా ఈ-బైక్‌లు, స్కూట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేసింది. ఇందులో ముఖ్యంగా స్ట్రోమ్ జెడ్ఎక్స్‌, ఎల‌క్ట్రికా, లిథినో-లీ, స్పోర్ట్స్-63 వంటివి మోడ‌ళ్లు ఇండియాలో ప్రాచుర్యం పొందాయి.

కొమాకి సంస్థ కూడా ఇటీవ‌ల komaki xgt x5 పేరుతో దివ్యాంగుల కోసం ప్ర‌త్యేకంగా మూడు చ‌క్రాల ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది.

3 Replies to “మూడు చ‌క్రాల Tunwal Three Wheeler Electric Scooter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *