Tree man : ఆరేళ్లలో 51వేల మొక్కలు నాటాడు.. ఈ పర్యావరణ ప్రేమికుడు..

Spread the love
  • తన లక్ష్యం చేరేవరకు ఆరేళ్లలో కనీసం చెప్పులు కూడా ధరించలేదు..

  • తన జీతంలో 90శాతం ఈ ప్రాజెక్టుకే..

రాజస్థాన్‌కు చెందిన టెక్ ప్రొఫెషనల్ అజిత్ సింగ్ కు చెట్లంటే ప్రాణం.. ఆయన ధ్యాసంతా పర్యావరణ పరిరక్షణపైనే.. విరివిగా మొక్కలు పెంచి భావితరాలకు స్వచ్ఛమైన పర్యవారణాన్ని అందించాలని నిత్యం తపన పడ్డాడు. అంతటితో ఆగకుండా తానే సొంతంగా 50వేల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఆరు నెలల్లోనే సుమారు 51,000
చెట్లను నాటి తన లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకున్నాడు అజిత్ సింగ్. రాజస్థాన్ తో ఈయన ‘చెట్టు మనిషి’ (tree man of rajasthan)గా గుర్తింపు పొందాడు. అజిత్ సింగ్ 2017లో ఈ గ్రీన్ మిషన్‌ను ప్రారంభించాడు.మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తన లక్ష్యాన్ని సాధించే వరకు చెప్పులు ధరించనని ప్రతిజ్ఞ చేశాడు.
అతను ఈనెల 17న తన లక్ష్యాన్ని సాధించాడు. ఈసందర్భంగా సికార్‌లో
గ్రామస్తులు నిర్వహించిన వేడుకల్లో అతని కృషికి అందరూ అభినందనలు తెలిపారు. అజిత్ సింగ్ ప్రయాణం యథార్త్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో ప్రారంభమైంది, దాని ద్వారా అతను తన చెట్లను నాటే ప్రచారాన్ని ప్రారంభించాడు.

అతను ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, “నేను ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి ప్రయత్నించాను. ఈ క్రమంలో చాలా మంది సహాయం చేయడానికి నాతో చేరారు. నేను ఈ పనిని త్వరగా పూర్తి చేయాలనుకున్నాను. కానీ చిన్న మొక్కలు చనిపోకుండా కాపాడుతూ అవి చక్కగా పెరిగేలా చూసుకోవాలనుకుంటున్నాను. . నా సహచరులు, స్నేహితులు టాస్క్ పూర్తి చేయడంలో నాకు సహాయం చేశారు.” అని తెలిపారు. అతను ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ.. “మేము ఎదుర్కొన్న ప్రధాన కష్టం ఏమిటంటే, సరైన స్థలాన్ని కనుగొనడం.. చిన్న మొక్కలు పెరిగే వరకు అది సురక్షితంగా ఉండేలా చూసుకోవడం. మరోవైపు మాలో చాలా మంది వర్షాకాలంలో మొక్కలు నాటారు.

“ఒక మొక్కను నాటడంవ వరకే మా బాధ్యత తీరిపోదు.. ఆ మొక్కలు పొడవుగా పెరిగి, వాటికవే సొంతంగా వృద్ధి చెందడానికి తగినంత బలమైన వేర్లు కలిగి ఉన్నప్పుడే అసలైన పని పూర్తవుతుంది. దీనిని సాధించడానికి, మొక్కలు పెరిగే వరకు పశువుల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించాలి. అవి పరిపక్వ వృక్షాలుగా మారిన తర్వాత, అవి పశువులకు పుష్కలంగా ఆహారాన్ని అందించగలవు” అని అజిత్ వివరించారు.

గత ఆరేళ్లలో తన జీతంలో దాదాపు 90 శాతం ఈ ప్రాజెక్ట్‌కే వెచ్చించానని సింగ్ చెప్పారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..