WagonR CBG

Wagon R CBG: పెట్రోల్, CNG అవసరం లేదు.. కొత్తగా బయో గ్యాస్ నడిచే మారుతి వ్యాగన్ ఆర్..

Spread the love

త్వరలో భారత్ లో అభివృద్ధి..

WagonR CBG: వాహనాల నుంచి వెలువడే హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రాబోయే కొన్నేళ్లలో చాలా దేశాలు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను నిలిపివేయనున్నాయి. న్యూఢిల్లీలో డీజిల్ కాళ్ళను పూర్తిగా నిషేధించారు. ఈ నేపథ్యంలో  ఇప్పటికే  చాలా దేశాల్లో, ప్రత్యామ్నాయ ఇంధనంతో వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందని దేశాల్లో, పెట్రోల్, డీజిల్ స్థానంలో CNG, ఇథనాల్ వంటి తక్కువ ఉద్గార ఇంధనాలు అందుబాటులోకి  వస్తున్నాయి. అనేక ఆటోమొబైల్ కంపెనీలు కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలతో వాహనాలను తీసుకొస్తున్నాయి.. ఇటీవల.. ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకి పెట్రోల్, డీజిల్, ఇథనాల్  అవసరం లేని కారును పరిచయం చేసింది. ఈ కారును నడపడానికి CNG  కూడా అవసరం లేదు.

జపాన్‌లోని టోక్యో ఆటో షోలో Suzuki అందించిన వ్యాగన్ఆర్ కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) తో నడుస్తుంది. దీన్ని వ్యర్ధాలు, ఆవు పేడతో తయారు చేశారు. అంటే,  ఇది పెట్రోల్, డీజిల్ లేదా CNGతో కాకుండా కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) వంటి చౌకగా ఉత్పత్తి చేసిన ఇంజిన్‌ల తో నడుస్తుంది. దీని కోసం ప్రభుత్వం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదు.. పెట్రోలియం ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే ఈ వాహనాల లక్ష్యం.

కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) అంటే ఏమిటి?

CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) మాదిరిగా.., CBG (కంప్రెస్డ్ బయో గ్యాస్) ఇంజిన్‌ను నడపడానికి ఉపయోగించవచ్చు. CNG పెట్రోలియం మూలాల నుంచి వస్తుంది. అయితే CBG వ్యవసాయ వ్యర్థాలు, ఆవు పేడ, మురుగు, మున్సిపల్ వ్యర్థాలు వంటి కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాల నుంచి పొందవచ్చు. కుళ్ళిపోయే ప్రక్రియ తర్వాత, బయోగ్యాస్ కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని తగ్గించడానికి ఒక శుద్దీకరణ ప్రక్రియకు గురి అవుతుంది. ఇది ఇంధనంలో మీథేన్ కంటెంట్‌ ను పెంచుతుంది. తద్వారా వాహనాలను నడపడానికి అనువుగా మారుతుంది.

CBG జీవ మూలాలు కుళ్ళిన తర్వాత ఉత్పత్తి చేసిన వ్యర్థ ఉత్పత్తులను వ్యవసాయ అవసరాలకు ఉపయోగించవచ్చు.. 2023 నాటికి 5,000 కుళ్ళిపోయే ప్లాంట్ల నుంచి 15 మిలియన్ టన్నుల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి దేశం 24 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 200 కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు 2020లో అప్పటి చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ చర్య ఇంధన దిగుమతులను తగ్గించడంలో భారతదేశానికి సహాయపడుతుంది. ప్రస్తుతం భారతదేశం తన దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి పెద్ద మొత్తంలో సీఎన్‌జీని దిగుమతి చేసుకుంటోంది.

భారతదేశంలో WagonR CBG అభివృద్ధి..

WagonR CBG ని భారతదేశంలో మారుతి సుజుకి ఇండియా అభివృద్ధి చేసింది. కంపెనీ 2022 నుంచి వ్యాగన్ఆర్ సీబీజీపై పని చేస్తోంది. డిసెంబర్ 2022లో, మారుతి సుజుకి E20 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వ్యాగన్ఆర్ ప్రోటోటైప్‌ను కూడా పరిచయం చేసింది. కొన్ని నెలల క్రితం, కంపెనీ చైర్మన్ RC భార్గవ కేవలం EVలపై ఆధారపడకుండా, హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించడం, CBG, CNG దేశంలో కార్బన్ పాదముద్రను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు.

CBGని ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఉపయోగించేందుకు గల అవకాశాలపై సుజుకి చాలా ఏళ్లుగా పనిచేస్తోంది. కంపెనీ గతంలో గుజరాత్‌లో బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బనాస్ డెయిరీ, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుతో చేతులు కలిపింది. సుజుకి సుమారుగా నాలుగు బయోగ్యాస్ ఉత్పత్తికేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తోంది. దీని మొత్తం పెట్టుబడి 230 కోట్ల వరకు ఉంటుంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

More From Author

Organic Farming

Organic Farming | ఆరోగ్యకరమైన పంటలకు.. సేంద్రియ పద్ధతులే శరణ్యం.. సేంద్రియ సాగుతో లాభాలు ఇవే..

Top 10 Electric Scooter Companies in India

భారత్ లో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు.. 2023లో సేల్స్, మార్కెట్ షేర్.. భవిష్యత్తు అవకాశాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *