Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు రైతులకు గమనిక: వేలం సమయాల్లో మార్పులు.. ఇకపై ప్రతి బుధవారం సెలవు! – Warangal Ennumamula...

రైతులకు గమనిక: వేలం సమయాల్లో మార్పులు.. ఇకపై ప్రతి బుధవారం సెలవు! – Warangal Ennumamula Market

0
Warangal Ennumamula Market Auction Timings 2026

ఎండల తీవ్రత దృష్ట్యా మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం.. ఏ సరుకు వేలం ఏ సమయానికో ఇక్కడ చూడండి!

Warangal Ennumamula Market Auction Timings 2026 : వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (Grain Market) కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, అడ్తిదారులకు మరియు కార్మికులకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు వేలం పాట (బీటు) సమయాలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త వేళలు ఏప్రిల్ 23, 2026 (గురువారం) నుండి అమల్లోకి రానున్నాయి.

పంట రకంవేలం ప్రారంభ సమయం
మిర్చిఉదయం 7:05 గంటలకు
పత్తిఉదయం 8:05 గంటలకు
పల్లికాయ (వేరుశనగ)ఉదయం 8:15 గంటలకు
పసుపుఉదయం 8:30 గంటలకు
అపరాలు, ధాన్యంఉదయం 8:45 గంటలకు

ప్రతి బుధవారం మార్కెట్‌కు సెలవు:

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మరియు వరంగల్ గ్రేన్ మార్కెట్ గుమస్తా సంఘం వారి విజ్ఞప్తి మేరకు, ఏప్రిల్ 22, 2026 నుండి వేసవి కాలం ముగిసే వరకు ప్రతి బుధవారం మార్కెట్ యార్డ్‌కు సెలవు ప్రకటించారు.

రైతులకు విజ్ఞప్తి: సెలవు రోజుల్లో (బుధవారం) రైతులు తమ సరుకులను మార్కెట్‌కు తీసుకువచ్చి ఇబ్బందులు పడవద్దని మార్కెట్ కమిటీ అధికారులు కోరారు. సరుకులను తీసుకువచ్చే రైతులు పైన పేర్కొన్న నూతన సమయాలను గమనించి అధికారులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.


పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదాం.. హరిత భారతాన్ని నిర్మిద్దాం!

గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ మరియు పర్యావరణానికి సంబంధించిన తాజా విశేషాల కోసం హరితమిత్రను సందర్శిస్తూ ఉండండి. నిరంతర వార్తా అప్‌డేట్స్ కోసం మా సోషల్ మీడియా వేదికలపై కనెక్ట్ అవ్వండి:

ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పర్యావరణం పట్ల అవగాహన పెంచేలా ఈ కథనాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి! 🌳✨

Previous articleఅగ్రికల్చర్ విద్యార్థినుల కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ కెరీర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రారంభం.
Next article100% ఇథనాల్ మిశ్రమంపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు – Ethanol Blending India
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here