solar system Installation | ఇళ్లలో సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజమేంటో అందరికీ తెలిసిందే.. స్థిరమైన పర్యావరణ హితమైన సమాజాన్ని ప్రోత్సహించడంతో పాటు, మీరు మీ నెలవారీ విద్యుత్ బిల్లులో 80% సోలార్ పవర్ తో ఆదా చేసుకోవచ్చు. ఇది ఏ ఇంటి యజమానికైనా అద్భుతమైన పెట్టుబడిగా చెప్పవచ్చు.
మీకు సొంత ఇల్లు ఉంటే మీరు సోలర్ సిస్టమ్ పెట్టుకునే అవకాశాల గురించి ఆలోచించండి.. అలాగే ఇది వచ్చే 25 సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లును ఆదా చేస్తుంది. కానీ కొనుగోలు కోసం మొదట పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి, ముందు విస్తృతమైన పరిశోధన చేయడం మంచిది. మీ ఇంట్లో సోలార్ సొల్యూషన్‌లను ఇన్‌స్టాల్ చేసే ముందు మీరు తెలుసుకోవలసిన విషయాలు ఒకసారి చూడండి..
ముందుగా సోలార్ పానెల్స్ నాణ్యత లేదా సోలార్ కంపెనీ పూర్వచరిత్ర, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకూడదు. సౌరశక్తి వల్ల మనకు 25 సంవత్సరాల వరకు డబ్బులు ఆదా చేస్తాయి. కాబట్టి స్వల్పకాలిక లాభం కోసం తక్కువ ధరకు లభిస్తుంది కదా అని నాణ్యత లేని నాసిరకమైన కంపెనీలను ఆశ్రయించవద్దు.
మీ ఇంటి పైకప్పు సోలార్ పానెల్స్ అమర్చడానికి అనువుగా ఉందా?
మీ ఇంటి పైకప్పు విశాలంగా, రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు అమర్చడానికి అనువైనదిగా ఉండాలి. ప్యానెల్‌ల బరువు, ప్యానెళ్లను అమర్చేందుకు ఉపయోగించే ఇతర విడి భాగాలకు మీ ఇంటి పైకప్పు సమస్య కాకూడదు. మీ పైకప్పు సరిగ్గా లేకుంటే అది మరమ్మతు చేసిన తర్వాతే సోలార్‌కు వెళ్లండి అలాగే, చాలా నగరాలు పట్టణాల్లో ఇండ్లు చాలా దగ్గర దగ్గరా ఉంటాయి. దీనివల్ల మీ రూఫ్‌టాప్ పై ధారాళంగా సూర్య కాంతి పడే అవకాశం ఉండదు.. కాబట్టి చుట్టుపక్కల భవనాలు లేదా వస్తువుల నీడలు పడకుండా చూసుకోవాలి.
మీ ఇంటిపై అమర్చిన సోలార్ ప్యానెల్ సిస్టమ్‌ను మార్చుకోవచ్చా?
solar system Installation మీరు ఎప్పుడైనా మీ సోలార్ సిస్టమ్ ను వేరే ప్రదేశంలోకి మార్చుకోవచ్చు. లేదా తొలగించుకోవచ్చు. అయితే, ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలి. ముందుగా మీ సోలార్ ఇన్‌స్టాలర్‌తో తనిఖీ చేయండి.
మీ ఇంటికి మీ సోలార్ సిస్టమ్ ను ఎవరి నుండి కొనుగోలు చేయాలి?
మీ సోలార్ సిస్టం 25 సంవత్సరాల పాటు మన్నికగా ఉండాలంటే నమ్మకమైన కంపెనీ నుంచి కొనుగోలు చేయండి.. లోకల్ గా సర్వీస్ ఉన్న కంపెనీని ఎంచుకోండి. అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండే సోలార్ ఇన్‌స్టాలర్‌ను ఎంచుకోవడం చాలా కీలకం. ఇన్స్టాలర్ అనుభవం, గతంలో వారు పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను పరిశీలించండి. సోలార్ సిస్టం వాడుతున్న ఇతర కుటుంబాలను సంప్రదించండి.
రాబోయే 25 సంవత్సరాల వరకు ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చు?
సోలార్ సిస్టం అనుకున్న విధంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే.. తరచుగా పానెల్స్ ను పర్యవేక్షిస్తూ ఉండాలి. డొమాస్టిక్ సోలార్ సిస్టం పానెళ్లు చాలా చిన్నాగా ఉండాయి. కాబట్టి ఇంటి యజమాని మేనేజ్ చేయవచ్చు. అయినప్పటికీ, సర్వీస్, మేనేజ్ మెంట్ ప్యాకేజీని కంపెనీ నుంచి తీసుకుంటే మంచిది. ఎక్కువ కాలం ఉండే ప్రీమియం-గ్రేడ్ మాడ్యూల్‌లను కొనుగోలు చేయాలి. ఫైర్, చోరీలకు గురిరైనప్పుడు రక్షణ కోసం సౌర బీమాను కొనుగోలు చేయాలి.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.
Better solution