Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా Ather 450 electric scooter

Spread the love

రేంజ్ 146కి.మి

దేశంలోని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీ తీవ్రతరం కావడంతో ప్ర‌ముఖ ఈవీ సంస్థ‌ ఏథర్ ఎనర్జీ తన Ather 450 electric scooter ను అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ స్కూట‌ర్‌లో పెద్ద బ్యాటరీ, హై రేంజ్‌తో విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. త్వ‌ర‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్.. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి, మ‌రింత శక్తివంతమైన మోటారుతో తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఏథర్ 450 సిరీస్‌లో కొన్ని స్టైలింగ్ మార్పులను కూడా చేయ‌నుంది. రేంజ్‌లో గణనీయమైన మార్పు ఉంటుంది. ఇది TVS ఐక్యూబ్‌, Ola వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూట‌ర్ల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నుంది.

సింగిల్ చార్జిపై 146కి.మి రేంజ్‌

2022 ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.66 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. అయితే ప్రస్తుత స్కూటర్‌లో 2.9 kWh బ్యాటరీ ఉంది. అప్‌గ్రేడ్ చేయబడిన Ather 450 రెండు ప్రధాన వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుది. రాబోయే ఏథర్ 450 స్కూట‌ర్ ARAI- ధ్రువీకరించబడిన పరిధి 146 కిలోమీటర్లు ఉంది. అప్‌గ్రేడ్ చేయబడిన 450 ఎక్స్ యొక్క వాస్తవ రేంజ్ 100-కిలోమీటర్ల మార్కును సులభంగా అధిగమిస్తుంది. అయితే ఇది ఓలా S1 ప్రో (135 కిమీ), TVS iQube ST (145) రేంజ్‌కు ఎంత దగ్గరగా ఉంటుందో చూడాలి.

Ather 450 electric scooter స్పెసిఫికేష‌న్లు..

ఏథ‌ర్ 450లో మొత్తం ఐదు రైడ్ మోడ్‌లు ఉంటాయి. అవి వార్ప్, స్పోర్ట్, రైడ్, స్మార్ట్‌ఎకో, ఎకో. వార్ప్ మోడ్‌లో పవర్ అవుట్‌పుట్ 450X యొక్క 6 kW (8.1 hp) నుంచి 6.4 kW (8.7 hp)కి పెరుగుతుంది. Ola S1 ప్రో 115 kph గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. అయితే iQube ST 82 kphకి పరిమితమైంది.

కొత్త ఏథ‌ర్ స్కూట‌ర్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల‌ని భావిస్తున్నారు. 2018 నుండి ఇది పెద్ద మార్పులు లేకుండా విక్ర‌యిస్తున్నారు. అప్‌గ్రేడ్ చేసిన మోడల్‌లో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఫ్రంట్/ రియర్ డిస్క్ బ్రేక్‌లతో పాటు రీజెన్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్క్, బెల్ట్ డ్రైవ్ సిస్టమ్. టైర్ ప్రెజర్ మానిటర్ ఉంటాయి.

Ather 450 ప్లస్ ధర రూ.1.31 లక్షల నుండి 450X (ఎక్స్-షోరూమ్, రాష్ట్ర సబ్సిడీలు లేకుండా) రూ. 1.50 లక్షల వరకు ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసిన Ather 450 ధర పెరిగే అవకాశం ఉంది. అయితే 2022 మోడల్‌లోని పెద్ద బ్యాటరీ స్కూటర్‌కు రూ. 50,000 కంటే ఎక్కువ FAME-II స‌బ్సిడీ ల‌భించ‌నుంది. ప్రస్తుత Ather 450X, ఏథ‌ర్ 450 Plus కు రూ. 43,500 మేర FAME-II సబ్సిడీ ఉంది. కాగా కొత్త ఏథ‌ర్ మోడ‌ల్‌కు iQube ST, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీ ఇవ్వ‌నున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *