Ather Rizta Best Deal

Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

Spread the love

Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియ‌న్స్ సెంట‌ర్ ను ప్రారంభించనుంది.

ఏథ‌ర్‌ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, స‌ర్వీస్ యాక్టివిటీస్‌ నిర్వహిస్తుంది. అదనంగా, ఎలక్ట్రిక్ వాహనాల విక్ర‌యాల‌ ప్రక్రియను సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా ఫాస్ట్-ఛార్జ్ పాయింట్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంపై కూడా ఏథర్ దృష్టి సారిస్తుంది.

ఈ విష‌యంపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ, “శ్రీలంక మార్కెట్‌లోకి ప్రవేశించడం మాకు చాలా ఆనందంగా ఉంది . నేపాల్ తర్వాత శ్రీలంక మా గ్లోబల్ విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఉంది, ఇక్కడ మేము గత సంవత్సరం మా ఉనికిని ఏర్పరచుకున్నాము. పెట్రోలు వాహనాల యాజమాన్యం ధర పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాల ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలతో శ్రీలంక మార్కెట్ EVలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది.

“ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వాటి పనితీరు, డిజైన్ పై వినియోగ‌దారుల్లో న‌మ్మ‌కం ఏర్ప‌డ్డాయి. దీని ద్వారా నాణ్యమైన ఆధునిక ఉత్పత్తులను కోరుతున్న కొత్త-త‌రం శ్రీలంక వినియోగదారులను ఆకర్షించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎవల్యూషన్ ఆటో ప్రైవేట్‌తో మా భాగస్వాంతో. శ్రీలంకలోని మా కస్టమర్‌లకు Ather స్కూట‌ర్ల‌ను చేరువ చేయ‌డానికి మాకు సహాయం చేస్తుంది, అదే సమయంలో EV వినియోగదారుల కోసం స‌ర్వీస్‌ నెట్‌వర్క్డ్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తుంది.

ఏథర్‌తో భాగస్వామ్యం గురించి ఎవల్యూషన్ ఆటో CEO, జహ్రాన్ జియావుదీన్ వ్యాఖ్యానిస్తూ శ్రీలంకలో స్థిరమైన రవాణాను అందించడం, పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ మొబిలిటీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా ల‌క్ష్యం. శ్రీలంకలో ప్రపంచ స్థాయి స్కూటర్ల శ్రేణిని ప్రారంభించేందుకు ఏథర్ ఎనర్జీ వంటి పరిశ్రమ దిగ్గజంతో కలిసి పనిచేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము అని తెలిపారు.

మొద‌ట నేపాల్ లో..

Ather Energy గత సంవత్సరం నేపాల్‌లో తన మొదటి ఎక్స్ పీరియ‌న్స్ సెంట‌ర్ ను (EC) ప్రారంభించింది అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 3 అనుభవ కేంద్రాలు, 7 ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌లను ఏర్పాటు చేసింది. భారతదేశంలో Ather 208 అనుభవ కేంద్రాలు, 1973 ఫాస్ట్-ఛార్జర్లు, Ather గ్రిడ్ (మార్చి 31 , 2024 నాటికి)తో రిటైల్ విక్రయాల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

More From Author

Kurma Village

Kurma Village | ప్రాచీన పద్ధతులు పాటిస్తున్న స్వచ్ఛమైన గ్రామం.. ప్రకృతితో మమేకమయ్యే జీవనం..

CNG Two-Wheeler

CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *