Ather Rizta | భారత విపణిలో సెప్టెంబరు 2024లో మొత్తం 89,940 యూనిట్లు అమ్ముడవడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. పరిశ్రమ నివేదికల ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ భారీగా ఈవీ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. అక్టోబర్ 30, 2024 నాటికి మొత్తం 20,000 యూనిట్లకు పైగా విక్రయించగా కేవలం అక్టోబర్‌లోనే అత్యధికంగా 20000 యూనిట్లను విక్రయించింది.
ఏథర్ నుంచి వచ్చిన కొత్త ఈవీ స్కూటర్, రిజ్టా(Ather Rizta) యూత్, తోపాటు అన్నివర్గాల నుంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏథర్ మొత్తం అమ్మకాల్లో ఇప్పుడు రిజ్టాదే అగ్రస్థానం. సెప్టెంబరు 2024లో ఏథర్ మొత్తం దేశీయ డెలివరీలు 16,582 యూనిట్లకు చేరాయి. వాటిలో రిజ్టా విక్రయాలు 9,867 నమోదు చేసింది. ఇది ఏథర్ ఎనర్జీ విజయంలో రిజ్టా స్కూటర్ కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతోంది.
అథర్ రిజ్టా: ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) సెగ్మెంట్‌లో ముఖ్యమైన ప్లేయర్‌గా స్థిరపడింది. ఏథర్ 450 పోర్ట్‌ఫోలియోలా కాకుండా, రిజ్టా ఫ్యామిలీస్కూటర్ గా ప్రజాదరణ పొందింది. కంపెనీ మొత్తం నెలవారీ అమ్మకాలలో 60 నుండి 70 శాతం వరకు రిజ్టానే ఉంది. ఏథర్ ఎనర్జీ సాంప్రదాయకంగా దక్షిణాదిలో ఆధిపత్యం చెలాయించగా, రిజ్టా ఉత్తర భారతదేశంలోకి విస్తరణను ప్రారంభించింది , ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్‌లలో మార్కెట్‌లను స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో బజాజ్ చేతక్ సొంత గడ్డ అయిన మహారాష్ట్రలోనూ ప్రవేశించింది.
రిటైల్‌లో, ఏథర్ ఎనర్జీ జూలైలో 12,828 వాహనాలు విక్రయించగా సెప్టెంబర్ లో20,000 యూనిట్లను చేరింది.ఈ వృద్ధి మార్కెట్ వాటాలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. జూలైలో 7.9 శాతం నుండి సెప్టెంబర్‌లో 14.3 శాతానికి చేరుకుంది.
ఏథర్ ఎనర్జీ: తర్వాత ఏమిటి?
డిమాండ్ విపరీతంగా పెరగడంతో, ఏథర్ ఎనర్జీ విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో కొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. తమిళనాడులోని హోసూర్‌లో ఇప్పటికే అతిపెద్ద ఫెసిలిటీని కలిగి ఉండగా కంపెనీకి ఇది రెండవ సౌకర్యం. గత నెల, ఏథర్ ఎనర్జీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)లో వివరించిన విధంగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్ షేర్‌హోల్డర్‌ల ద్వారా 2.2 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS)తో సహా రూ. 3,100 కోట్లను సమీకరించడానికి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ( ఐపిఓ ) కోసం దాఖలు చేసింది. ఏథర్ ఎనర్జీ CEO తరుణ్ మెహతా, సహ వ్యవస్థాపకుడు స్వప్నిల్ జైన్ 1 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. అయితే హీరో మోటోకార్ప్.. ఏథర్ ఎనర్జీలో తన 37.2 శాతం వాటాను కలిగి ఉంటుంది. IPO సమయంలో దాని వాటాలను విక్రయించదు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..