ఏథర్ ఎనర్జీలో Hero MotoCorp రూ.420 కోట్ల పెట్టుబడి
ఆటోమొబైల్ దిగ్గజం Hero MotoCorp 'బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ' విజన్‌లో భాగంగా ఇ-మొబిలిటీ కోసం వ్యూహాత్మకంగా ముంందుకు సాగుతోంది. కంపెనీ ఇటీవలే ఏథర్ ఎనర్జీ కంపెనీలో రూ.420 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో పెట్టుబడి పెట్టనుంది.
విజన్ 'బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ
హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ స్వదేశ్ శ్రీవాస్తవ - మాట్లాడుతూ "మా విజన్ 'బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ'కి అనుగుణంగా మేము మొబిలిటీ సొల్యూషన్స్‌పై పని చేస్తున్నాము. మేము ఏథర్ ఎనర్జీలో మొదటి పెట్టుబడిదారులలో ఒకరిగా ఉన్నామని తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో ఏథర్ ఎనర్జీ వృద్ధిని చూసి సంతోషిస్తున్నట్లు తెలిపారు.Hero MotoCorp బ్రాండ్ను విస్తరించడం EV మొబిలిటీని ప్రపంచవ్యాప్తంగా కస్టమర్‌లకు అనుకూలమైన, అవాంతరాలు లేని అనుభవాన్ని అందించడమే మా లక్ష్యమన...