Joy e-bike అమ్మకాల్లో 502% వృద్ధి
అక్టోబర్ 2021లో Joy e-bike 502% అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఒక్క నెలోనే 2,855 ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు విక్రయించి రికార్డు సృష్టించింది. జాయ్ ఇ-బైక్ తయారీదారు అయిన వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్., అక్టోబర్ 2021 నెలలో తన సేల్స్ నివేదికను ప్రకటించింది.ఇండియాకు చెందిన Wardwizard Innovations & Mobility Limited సంస్థ జాయ్ ఇ-బైక్ బ్రాండ్ పేరుతో దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్రయిస్తోంది. కంపెనీ FY22 రెండవ త్రైమాసికానికి (జూలై- సెప్టెంబర్ 2021) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జాయ్ ఇ-బైక్ గత నెలలో కంపెనీ భారీస్థాయిలో అమ్మకాలతో అక్టోబర్ 2021ని ముగించింది. 2021 అక్టోబర్‌లో యోవై ప్రాతిపదికన కంపెనీ 502 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏ త్రైమాసికంలోనూ ఇంత అత్యధిక ఆదాయాన్ని సాధించలేదు.Joy e-bike అక్టోబర్ 2021లో భారతదేశంలో 2,855 యూనిట్ల ఎలక్ట్రిక్ స్క...