Sunday, December 22Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

ఓలా.. అదిరిపోలా..

ఓలా.. అదిరిపోలా..

E-scooters
క‌నీవినీ ఎరుగ‌ని ఫీచ‌ర్ల‌తో ola electric s1. s1 pro ఈ స్కూట‌ర్‌లో పాట‌లువినొచ్చు.. కాల్స్ మాట్లాడొచ్చు..ola electric s1. s1 pro.. ఎన్నో రోజుగా ఊరిస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. ఎట్ట‌కేల‌కు అట్ట‌హాసంగా లాంచ్ అయింది. స్టైలిష్ బాడీ.. అదిరిపోయే అత్యాదునిక స్మార్ట్ ఫీచ‌ర్లు క‌లిగిన ఈ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూశారు.ఎట్టకేలకు భారతదేశం తన 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లు ola electric s1. s1 pro దేశంలో విడుదల చేసింది. ఇది ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.Ola S1 Electric scooter మోడ‌ల్ ధ‌ర(గుజ‌రాత్‌లో) రూ .79,999. అలాగే S1 ప్రో ధ‌ర రూ.1,09,999. గుజ‌రాత్‌లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంది. మిగ‌తా రాష్ట్రాల్లో ఓలా ఎస్ 1 ధర రూ.99,999. అలాగే ఓలా S...
Skellig Lite e-cycle విడుద‌ల‌

Skellig Lite e-cycle విడుద‌ల‌

Electric cycles
GoZero కంపెనీ ఇండియాలో ఓ ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను లాంఛ్ చేసింది. Skellig Lite e-cycle పేరుతో విడుద‌ల చేసిన ఈ సైకిల్ ధ‌ర రూ.19,999 వద్ద ప్రారంభ‌మ‌వుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ధ‌ర‌లో ల‌భించే ఎల‌క్ట్రిక్ సైకిల్‌గా నిలిచిందని చెప్ప‌వ‌చ్చు. Skellig Lite e-cycle స్పెసిఫికేష‌న్స్‌ గోజీరో సైకిల్ 25 కి.మీ రేంజిని క‌లిగి ఉంటుంది. గంట‌కు గరిష్టంగా 25 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. Skellig Lite e-cycle లో డిటాచ‌బుల్ ఎనర్‌డ్రైవ్ 210 Wh లిథియం బ్యాటరీ ప్యాక్ ను వినియోగించారు. ఇక వెనుక చ‌క్రానికి 250 W వెనుక హబ్-డ్రైవ్ మోటార్‌తో ఇది శ‌క్తిని పొందుతుంది. GoZero డ్రైవ్ కంట్రోల్ 2.0 LED డిస్‌ప్లే యూనిట్ ద్వారా నియంత్రించబడుతుంది. ఇందులో మూడు పెడల్-అసిస్ట్ మోడ్‌లను ఎంచుకునే ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇందులోని బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటలే పడుతుంది. లైట్‌లో 26 × 1.95 టైర్లు, ప్రత్యేకమైన V- బ్రేక్‌ల...
EVTRIC నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ మోపెడ్‌

EVTRIC నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ మోపెడ్‌

E-scooters
, స‌రుకుల ర‌వాణాకు అనుకూలం సింగిల్ చార్జిపై 110కి.మి రేంజ్‌EVTRIC మోటార్స్ సంస్థ మ‌రో ఎలక్ట్రిక్ వెహికల్‌ను విడుద‌ల చేసింది.  న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల జరిగిన EV ఎక్స్‌పో 2021 లో తన B2B E- డెలివరీ స్కూటర్‌ను ప్రదర్శించింది.  ఈ స్కూట‌ర్ స‌రుకుల డెలివ‌రీ కోసం ఉద్దేశించింది. ఇందులో స‌రుకుల‌ను ఉంచేందుకు అదనపు క్యారియర్ల‌తో వ‌స్తుంది.  ఇది లోస్పీ్ వెహికిల్‌ గంటకు 25 కిమీ వేగంతో వెళ్తుంది.  ఈ స్కూటర్ స్థానిక వ్యాపారాల డెలివరీలకు చ‌క్క‌గా సరిపోతుంది.  ఇందులో 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. 150 కిలోల లోడింగ్ సామర్థ్యం కలిగి ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.ఈ స్కూటర్లోని లిథియం-అయాన్ బ్యాటరీని ఛార్జ్ కావడానికి సుమారు మూడున్నర గంటలు పడుతుంది.  ఇది డిటాచ‌బుల్ బ్యాట‌రీ. స్కూట‌ర్ నుంచి విడ‌దీసి చార్జ్ పెట్టుకోవ‌చ్చు.  ఒక్క‌సారి చార్జి చేస్తే 110 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు...
Revolt RV400 క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌

Revolt RV400 క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌

E-bikes
 రివోల్ట్ బైక్కు కొత్త ఫీచ‌ర్ల‌ కీ అవ‌సరం లేకుండా స్వైప్ టూ స్టార్ట్ ఫీచ‌ర్Revolt RV400 ఎల‌క్ట్రిక్ బైక్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త. రివోల్ట్ మోటార్స్ సంస్థ‌ కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌ను అందిస్తోంది.  రివాల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ త‌న మొట్ట‌ మొదటి రెండు మోటార్‌సైకిళ్లను 2019 లో విడుదల చేసింది.  అచ్చం పెట్రోల్ స్పోర్ట్స్ బైక్‌ను త‌లపించేలా వ‌చ్చిన ఈ బైక్‌కు వ‌చ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ బైక్ పై వ‌చ్చిన డిమాండ్‌తో స‌ప్ల‌యి చేయ‌లేక రివోల్ట్.. బుకింగ్‌లను నిలిపివేయవలసి వచ్చింది. అయితే త‌న వినియోగారుల కోసం ఇప్పుడు కంపెనీ త‌న రివోల్ట్ ఆర్వీ 400ను అప్‌డేట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.  సెప్టెంబర్‌లో డెలివ‌రీ చేయ‌నున్న కొత్త Revolt RV400 బైక్‌లు స్మార్ట్‌ఫోన్ ఆధారిత కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌తో వ‌స్తాయి.మోటార్‌సైకిల్‌ని స‌మీపించేట‌ప్పుడే తమ స్మార్ట్‌ఫోన్‌లో రివాల...
Simple One electric scooter ప్రీబుకింగ్స్‌..

Simple One electric scooter ప్రీబుకింగ్స్‌..

EV Updates
రూ.1947తో ప్రీబుకింగ్స్‌సింపుల్ ఎనర్జీ, బెంగుళూరుకు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ తయారీ సంస్థ గురువారం నుంచి తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One electric scooter కోసం ప్రీ-బుకింగ్స్ ను ప్రారంభించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌ను 15 ఆగస్టు, 2021 న ఆవిష్క‌రించ‌నున్న విష‌యం తెలిసందే. అయితే ప్రీ బుకింగ్స్ కోసం రూ.1,947 చెల్లించాల‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ప్రీ-బుకింగ్ సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. వాహనాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ మొత్తం వాపసు చేయబడుతుంది. ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల విక్ర‌యించేట‌ప్పుడు ప్రీ-ఆర్డర్ చేసుకున్న‌వారికి ప్రాధాన్యం ఇస్తారు. 6కిలోల బ్యాట‌రీ.. ప్రీబుకింగ్ వివ‌రాల‌తోప‌టు సింపుల్ ఎన‌ర్జీ కంపెనీ త‌న Simple One electric scooter కు సంబంధించి మ‌రికొత స‌మాచారాన్ని పంచుకుంది. క‌ సింపుల్ ఎనర్జీ స్కూటర్ కోసం బూడిద రంగులో ఉన్న‌...
ఏథ‌ర్ ఎన‌ర్జీ.. fast-charging Stations…

ఏథ‌ర్ ఎన‌ర్జీ.. fast-charging Stations…

EV Updates
ప్రారంభించ‌నున్న‌ ఏథర్ ఎనర్జీఏథర్ ఎనర్జీ సంస్థ తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతోపాటు ఇత‌ర కంపెనీల ఈవీల కోసం Charging stations ప్రారంభిస్తోంది.  ప్ర‌స్తుతం ఉన్న ఏథర్ ఎనర్జీ 200+ ఫాస్ట్ ఛార్జర్‌లను ఇత‌ర కంపెనీల ఈవీలు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.  అది కూడా ఉచితంగా. ఫ‌లితంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు వాడేవ‌రు ఇక చార్జింగ్‌పై ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేదు.  దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పెరుగుదలకు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధాన సమస్యగా ఉంది.  ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తృతి, సామర్థ్యాన్ని పెంచడానికి మ‌రిన్ని Charging stations ను ఏర్పాటు చేయాల్సి ఉంది.ఏథర్ ఎనర్జీ సంస్థ తన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ గ్రిడ్‌ను రంభించింది.  ఇది అన్నిర‌కాల కంపెనీల‌కు చెందిన‌ ఎలక్ట్రిక్ టూవీలర్‌లు, నాలుగు చక్రాల వాహనాలకు కోసం సాధారణ స్పీడ్ ఛార్జ్ ఎంపికలను ఉచితంగా అందిస్తోంది.  దేశవ్యాప్తంగా ఏథర్ ఎనర...
హోండా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వ‌స్తోంది..

హోండా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వ‌స్తోంది..

E-scooters
చైనాలో Honda U-GO E-Scooter విడుద‌ల‌ త్వ‌ర‌లో ఇండియాలోకి.. గంట‌కు 53కిమీ వేగం డ్యూయ‌ల్ బ్యాట‌రీతో సింగిల్ చార్జిపై 130కి.మి రేంజ్‌పెట్రోల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతుండ‌డంతో అంద‌రూ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు. క్ర‌మంగా అనేక చిన్నాచిత‌క కంపెనీల‌తోపాటు కార్పొరేట్ దిగ్గ‌జాలు సైతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీలోకి వ‌స్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గ‌జం హోండా.. కొత్త‌గా ఎల‌క్ట్రిక్ వాహ‌న‌రంగంలోకి దిగింది. ఇటీవ‌లే ఒక స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. అయితే అది మ‌న‌దేశంలో కాదు. చైనాలో Honda U-GO E-Scooter ను ప్ర‌వేశ‌పెట్టింది.హోండా సంస్థ కొత్తగా Honda U-GO E-Scooter ను ప్ర‌స్తుతం చైనా మార్కెట్లో ప్రవేశపెట్ట‌గా త్వ‌ర‌లో ఇండియాతోపాటు ఇత‌ర దేశాల్లోనూ విస్తరించ‌నుంది.  హోండా యొక్క చైనీస్ అనుబంధ సంస్థ ఇ-స్కూటర్‌ను CNY 7,499 సరసమైన ధర వద్ద ప...
Simple Energy ప‌వ‌ర్‌ఫుల్ ఫాస్ట్ చార్జ‌ర్‌

Simple Energy ప‌వ‌ర్‌ఫుల్ ఫాస్ట్ చార్జ‌ర్‌

EV Updates
బెంగుళూరుకు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ Simple Energy కొత్తగా సింపుల్ లూప్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఆవిష్క‌రించింది.  దీంతో పాటు ఈ సంస్థ త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న సింపుల్ వన్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు సంబంధించిన కొంత స‌మ‌చారాన్ని పంచుకుంది.  దీని ప్రకారం సింపుల్ వ‌న్ ఎలక్ట్రిక్ స్కూట‌ర్లో 30 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్‌లో అతి పెద్దదని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా 300 ఛార్జింగ్ స్టేష‌న్లు Simple Energy సింపుల్ లూప్ ఫాస్ట్ ఛార్జర్‌కు సంబంధించి దాని ప్రణాళికలను వెల్ల‌డించింది. ఇది దేశ‌వ్యాప్తంగా అన్ని న‌గ‌రాల్లో ఏర్పాటు చేయ‌నుంది. కొన్ని నెల‌ల్లో సింప‌ల్ ఎన‌ర్జీ కంపెనీ 300కు పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయ‌నుంది.  ఇందులో అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఛార్జీలు ఉపయోగించడానికి సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.  ఇక ఈ ఛార్జర్‌ల...
హీరో ఏట్రియా.. నో లైసెన్స్‌.. నో రిజిస్ట్రేష‌న్‌..

హీరో ఏట్రియా.. నో లైసెన్స్‌.. నో రిజిస్ట్రేష‌న్‌..

E-scooters
మ‌హిళ‌లు, వృద్ధుల‌కు ప్ర‌త్యేకం..గంట‌కు 25కి.మి స్పీడ్‌ సింగిల్ చార్జిపై 85కి.మి రేంజ్‌ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం హీరో ఎల‌క్ట్రిక్ గ‌తేడాది Hero Electric Atria అనే పేరుతో లోస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను ప్రారంభించింది. ఈ స్కూట‌ర్ త‌క్కువ స్పీడుతో వెళ్తుంది కాబ‌ట్టి మ‌హిళ‌లు, వృద్ధుల‌కు, పిల్ల‌ల‌కు ఇది చ‌క్క‌గా స‌రిపోతుంది. ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్‌, ఎల్ఈడీ లైట్ల‌తో చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంటుంది. ఈ మోడ‌ల్‌లో ప్ర‌స్తుతానికి ఒక వేరియంట్‌ను మాత్ర‌మే తీసుకొచ్చారు. అది ఏట్రియా ఎల్ఎక్స్‌.. దీనికి ఎలాంటి రిజిస్ట్రేష‌న్లు, డ్రైవింగ్ లైసెన్సులు అవ‌స‌రం లేదు. సింగిల్ చార్జ్‌పై 85కిలోమీట‌ర్లుHero Electric Atria గంట‌కు 25కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 85కిలోమీట‌ర్ల వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ అట్రియా ప్రారంభ ధర రూ. 6...