బ‌జాజ్ ఎల‌క్ట్రిక్ ఆటో చూశారా?

Spread the love

త్వ‌ర‌లో విడుద‌ల కానున్న Bajaj Electric three wheeler

దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం ఆటోబ‌జాజ్ ఆటో నుంచి మొట్ట‌మొదటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ వాహ‌నం ప్యాసింజర్, కార్గో వెహికల్ కేటగిరీలు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి కంపెనీ గత ఏడాది Bajaj Electric three wheeler (ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌) ను విడుదల చేయాలని భావించింది. అయితే వినియోగదారుల భద్రత కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింది.

బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివ‌రాలు వెల్ల‌డించారు. వాణిజ్య వినియోగదారులకు స్థిరమైన, అనుకూల‌మైన‌ ప్రొడ‌క్ట్‌ల‌ను అందించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ Bajaj Electric three wheeler “FAME ఆమోదం పొందింది. అలాగే ARAI సర్టిఫికేషన్ కూడా మంజూరు అయింది. రాబోయే వారాల్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

FY2025 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వ్యాప్తి 8% నుండి 14%-16% వరకు పెరుగుతుందని ICRA నివేదిక తెలిపింది. తాజా ఉత్పత్తి మరింత జనాదరణ పొంద‌డం, ఫైనాన్సింగ్ సమస్యలు తక్కువగా ఉండటం వలన FY2030 నాటికి మార్కెట్ వ్యాప్తి 35-40%కి పెరుగుతుందని అనేక రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.

Q3 FY2023 నాటికి సంప్ర‌ద‌యా పెట్రోల్‌/ డీజిల్ త్రీ-వీలర్ మార్కెట్లో Bajaj Auto (బజాజ్ ఆటో) కంపెనీ 76% మార్కెట్ వాటాను కలిగి ఉంది. మ‌రోవైపు మహీంద్రా & మహీంద్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్ల మార్కెట్ లీడర్‌గా ఉంది. బజాజ్‌ కంపెనీ ప్రస్తుతం మహీంద్రా & మహీంద్రాతో పోటీ పడటానికి బ‌జాజ్ వ‌ద్ద ఎలక్ట్రిక్ వెహిక‌ల్ (Electric Vehicles ) ఇప్ప‌టివ‌ర‌కు ఏవీ లేవు. అయితే ఏప్రిల్‌లో బజాజ్ ఆటో వాహన ఉత్పత్తి ధరల పెరుగుదల వాహన డిమాండ్‌పై తక్కువ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేసింది.


Songs Lyrics

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..