Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

KICK-EV :  ఐదేళ్ల పాటు ఉచిత స‌ర్వీస్‌లు

Spread the love

స‌రికొత్త ఆఫ‌ర్‌తో త్వ‌ర‌లో మార్కెట్‌లోకి ..

KICK-EV అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌తో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో కొత్త‌గా ప్ర‌వేశిస్తోంది. ఈ కంపెనీకి చెందిన Smassh e-scooter (స్మాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ) ను కొత్త ఆర్థిక సంవత్సరం Q1లో విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇ-స్కూటర్ ఆరు రంగులలో లభిస్తుంది. జీరో బుకింగ్ మొత్తంతో అందించబడుతుంది. KICK-EV వినియోగదారులందరికీ అమ్మకాల త‌ర్వాత ఉచితంగా 5 సంవత్సరాల పాటు స‌ర్వీస్ వారంటీ ఇస్తోంది. ఈ 5-సంవత్సరాల వారంటీ మోటార్, కంట్రోలర్ కన్వర్టర్ వంటి కీలక భాగాలతో పాటు చట్రం, డ్రైవ్‌ట్రెయిన్, టైర్ల వంటి భాగాలను కవర్ చేస్తుంది. భారతదేశం అంతటా విస్తరించి ఉన్న KICK-EV కి చెందిన 58,000 ప్లస్ స‌ర్వ‌స్ సెంట‌ర్ల‌లో అందుబాటులో ఉండ‌నుంది.

READ MORE  Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

సింగిల్ చార్జ్‌పై 160కి.మి రేంజ్

భారతీయ వాతావరణ పరిస్థితులు, డ్రైవింగ్ స్టైల్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ Smassh e-scooter. ఇందులో 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించారు. ఒక్కసారి ఛార్జ్‌పై 160 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. అలాగే .గంటకు 75 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళుతుంది.  పర్యావరణ అనుకూలమైన, శక్తివంతమైన రవాణా విధానాన్ని కోరుకునే వారికి ఖచ్చితంగా ఈ స్కూట‌ర్ న‌చ్చుతుంది.  ఇ-స్కూటర్ ఫాస్ట్-చార్జింగ్ ఫీచ‌ర్‌తో వేగంగా బ్యాట‌రీని చార్జ్ చేయ‌వ‌చ్చు. మైక్రో డి స్మార్ట్ ఇంటెలిజెంట్ ఛార్జర్ గంటలోపు 80% ఛార్జ్ చేస్తుంది. కేవ‌లం 3.5 గంటల్లోనే పూర్తి ఛార్జ్ ఇస్తుంది.

READ MORE  Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?
KICK-EV
Smassh Electric Scooter

స్మార్ట్ ఫీచ‌ర్లు

ఇ-స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్, కాంబి బ్రేక్ సిస్టమ్, ముందు /వెనుక డిస్క్ బ్రేక్‌లను వినియోగించారు. GPS, అల్లాయ్ వీల్స్ స్మార్ట్ కనెక్టివిటీ వంటి ప్రత్యేక లక్షణాలతో ఉంది.
స్మాష్ ఆరు మెరిసే రంగులలో అందుబాటులో ఉంది.. సిట్రిన్ ఎల్లో, గార్నెట్ రెడ్, ఐయోలైట్ బ్లూ, అబ్సిడియన్ బ్లాక్, పెటలైట్ సిల్వర్, జిర్కాన్ వైట్, అన్నీ 120/70-12 (ట్యూబ్‌లెస్) ముందు వెనుక టైర్‌లతో అల్లాయ్ వీల్స్‌తో అలంకరించబడ్డాయి. ఇవి కఠినమైన భారతీయ రోడ్ల‌ను త‌ట్టుకోగ‌ల‌వు. బైక్‌లో శక్తివంతమైన LED లైట్లు కూడా ఉన్నాయి. ఇవి రైడర్‌లకు సేఫ్టీని అందిస్తాయి. ఇక ఈ ఎల‌క్ట్రిక్ స్కూటర్ ధర ₹ 1.75 లక్షలుగా ఉంది. .

READ MORE  Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

కంపెనీ ఏం చెబుతోంది.?

KICK-EV, AUTO-i-CARE వ్యవస్థాపకుడు సాగర్ జోషి మాట్లాడుతూ.. “భారతీయ వినియోగదారు తమ 2-వీలర్‌ తో ఎక్కువ అనుబంధాన్ని క‌లిగి ఉంటారు. వాహ‌నాన్ని వారి కుటుంబంలో భాగంగా పరిగణిస్తారు. ఈ భారతీయ మనస్తత్వానికి అనుగుణంగా, KICK-EV భారతీయ మార్కెట్‌కు “స్మాష్”ని పరిచయం చేయడం గర్వంగా ఉంది. భారతీయ వినియోగదారులకు ప్రధాన గేమ్ ఛేంజర్‌గా మేము భావిస్తున్నామ‌ని తెలిపారు. తాము అన్ని వేరియంట్‌లలోని అన్ని KICK-EV బైక్‌లకు 5 సంవత్సరాల ఉచిత అమ్మకాల తర్వాత సేవను అందిస్తున్నామ‌ని చెప్పారు. ఈ ఆఫర్‌తో ముందుకు రావడానికి కార‌ణం త‌మ బ్రాండ్, మా ఉత్పత్తిపై ఉన్న‌నమ్మక‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. AUTO-i-CAREతో, మేము ఇప్పటికే దేశవ్యాప్తంగా స‌ర్వీస్‌సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. KICK-EV మరింత మంది ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా ప్రోత్సహించాలని భావిస్తోంద‌ని తెలిపారు.

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *