Black Diamond Apples | ఆరోగ్యరక్షణకు యాపిల్స్ (Apples ).. ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్ తినాలని.. వీటిని తినటం వల్ల వై ద్యుడి అవసరమే ఉండదని చెబుతారు. ఈ యాపిల్స్ లో విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలు విరివిగా ఉంటాయి. వీటిని సలాడ్స్‌లో, డెజర్ట్‌గానూ, జూస్ లు చేసుకొని సేవించవచ్చు. అయితే, మనం ఇప్పటివరకూ రెడ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్‌ను మాత్రమే చూసి ఉన్నాం. మార్కెట్లలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. కానీ బ్లాక్ యాపిల్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? అయితే ఒకసారి ఈ కథనం చదవండి..
నలుపు రంగులో కనిపించే ఈ యాపిల్స్ అత్యంత ఖరీదైనవి.. మొత్తం యాపిల్ జాతుల్లోనే ఈ పండు అత్యంత స్పెషల్.. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అలాగే ఎన్నో వ్యాధులను కూడా నయం చేసే గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవి కేవలం చైనా, టిబెట్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. వీటిని ‘బ్లాక్ డైమండ్ యాపిల్స్’ (Black Diamond Apples) అని కూడా పిలుస్తారు.. పైన నల్లగా ఉన్నా.. లోపల మాత్రం సాధారణ యాపిల్ మాదిరిగానే తెల్లగా ఉంటుంది. ఈ పండును చూడగానే తినేయాలి అనిపించేలా నిగనిగలాడుతూ ఉంటుంది.
Black Diamond Apple Price : దీని ధర విషయానికి వస్తే ఒక్కో పండు రూ.500 వరకు ఉంటుంది. ఈ ఆపిల్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. .. సాధారణంగా యాపిల్ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు పెడతాయి. కానీ బ్లాక్ యాపిల్ తొలి పంట చేతికి అందడానికే కనీసం 8 సంవత్సరాల సమయం పడుతుందట.. ఇంతటి ప్రత్యేకతలు (Unique Variety) కలిగిన ఈ బ్లాక్ డైమండ్ ఆపిల్స్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి..
Black Dimond Apple 🍎🖤 pic.twitter.com/sAeBRyP8Uv
— بلال احمد خان (@rbilalahmedkhan) December 9, 2021
Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
👍