Bounce Infinity electric scooter : ఎట్టకేలకు బౌన్స్ కంపెనీ తన ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Bounce Infinity కోసం కనీస టోకెన్ మొత్తం రూ.499తో బుకింగ్ చేసుకోవచ్చు. 2022 ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ ఇన్ఫినిటీ స్కూటర్ బ్యాటరీతో గానీ, బ్యాటరీ లేకుండా గానీ కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది.
ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఎంపికను కూడా అందించనున్నట్లు బౌన్స్ తెలిపింది. దీని కింద, వినియోగదారులు బ్యాటరీ లేకుండా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ లేకుండా స్కూటర్‌ను కొనుగోలు చేసినవారు బౌన్స్ యొక్క బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. కచ్చితంగా చెప్పాలంటే.. మీరు బ్యాటరీని సర్వీస్ ఆప్షన్‌గా ఎంచుకుంటే(బ్యాటరీ లేకుండా).. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ.36,000 వరకు మీ సొంతం అవుతుంది. దీని కోసం మీరు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవాలి. దాని వివరాలు త్వరలో కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
మీరు బ్యాటరీ, ఛార్జర్‌తో స్కూటర్‌ను కొనుగోలు చేస్తే.. అది మీకు రూ.68,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రాష్ట్రాల వారీగా ధరల్లో వ్యత్యాసం ఉంది. రాబోయే 24 నెలల్లో ఒక మిలియన్ స్కూటర్ల కోసం స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించాలని యోచిస్తున్నట్లు బౌన్స్ సంస్థ తెలిపింది. బౌన్స్ ఇన్ఫినిటీ మొబైల్ యాప్‌తో, కస్టమర్‌లు సమీపంలోని బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.
దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బౌన్స్ తన డీలర్‌షిప్‌లను త్వరలో ప్రారంభించనుంది. ఈ స్కూటర్ టెస్ట్ రైడ్‌లు డిసెంబరు-2021లో ఉంటాయి.
85కి.మి రేంజ్
బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ ఈ-1 ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 85కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని బ్యాటరీని ఫుల్ చార్జ్ చేసేందుకు సుమారు 4గంటల సమయం పడుతుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ, కాబట్టి ఈ బ్యాటరీని స్కూటర్ నుంచి విడదీసి చార్జ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ఐదు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి.. స్పోర్టీ రెడ్, పెర్ల్ వైట్, స్పార్కిల్ బ్లాక్, కామెట్‌గ్రే, డెసర్ట్ సిల్వర్, ఇవన్నీ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఈ స్కూటర్‌లో ఐపీ67 వాటర్‌ప్రూఫ్ కలిగిన 48వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీని చూడొచ్చు. ఈ స్కూటర్ 83 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక వాహనంలో ముందు, వెనక డిస్క్ బ్రేక్‌లను అందించడం వల్ల బ్రేకింగ్ అద్భుతంగా ఉండనుంది.
మిగతా వివరాలకు బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి
https://bounceinfinity.com/
Nice