భారతీయ స్టార్టప్ ఘనత
సింగిల్ చార్జిపై అత్యధిక రేంజ్ ఇచ్చే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా హైదరాబాద్ స్టార్టప్ Brisk EV త్వరలో లాంగర్ రేంజ్ ఈవీని తీసుకొస్తోంది. Brisk EV Electric Scooter ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 333కి.మి రేంజ్ ఇస్తుంది. త్వరలో డెలివరీలు ప్రారంభం కానున్న సింపుల్ వన్ (Simple One) ఈవీ రేంజ్ 300కి.మి ఉంటుందని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రో-మొబిలిటీ, మైక్రో-మొబిలిటీ పై ప్రజలు ఎక్కువ ఆసక్తిని పెంచుకోవడంతో స్కూటర్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే ఛార్జ్-ఎట్-హోమ్ స్కూటర్, బ్యాటరీ-స్వాపింగ్ బైక్ మధ్య లాభనష్టాలను అంచనా వేసే వారి కోసం భారతీయ స్టార్టప్ Brisk EV కొత్తగా రెండు ఫీచర్లు, అంటే పర్మినెంట్, డిటాచబుల్ బ్యాటరీలు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది.
Brisk EV Eletcric scooter లు కొన్ని ఇన్‌బిల్ట్ (స్థిరమైన) బ్యాటరీని కలిగి ఉంటాయి. అలాగే కొన్ని మోడల్‌లు మార్చుకోగలిగే బ్యాటరీ డిటాచబుల్ బ్యాటరీ (swappable battery) కోసం ఖాళీ స్లాట్‌ను కలిగి ఉంటాయి. బ్రిస్క్ EV సహ వ్యవస్థాపకుడు వివేక్ రెడ్డి మాట్లాడుతూ స్థిరమైన, మార్చుకోగలిగే బ్యాటరీ రెండింటినీ ఉపయోగించడం వల్ల మనకు అవసరమైనప్పుడు ఎక్కువ రేంజ్‌ను అందించే వెసులుబాటు ఉంటుంది.
ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్
బ్రిస్క్ కంపెనీ తీసుకొచ్చిన ఆరిజిన్ ప్రో (Origin Pro Electric Scooter) ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీలు కలిగి ఒకే ఛార్జ్‌తో 333కిమీల పరిధిని చేరుకోగలదు. మార్చుకోగల బ్యాటరీని జత చేయడం వల్ల వలన ఎక్కువ రేంజ్ పెరగడమే కాకుండా, బ్యాటరీ ఛార్జింగ్ లెవల్స్ తక్కువగా ఉన్న సమయాల్లో బ్యాటరీ స్వాపింగ్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.
మార్చుకోగలిగే బ్యాటరీ లీజుకు మాత్రమే ఉంటుందని వివేక్ రెడ్డి చెప్పారు. సాధారణ ప్రయాణానికి స్థిరమైన బ్యాటరీ సరిపోవలసి ఉండగా, కస్టమర్‌లు తమ ట్రిప్‌కు అవసరమైన కాలం పాటు స్వాప్ చేయగల బ్యాటరీని లీజుకు తీసుకోవచ్చు. Brisk EV Eletcric scooter
ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్, ఛార్జింగ్ పాయింట్లు, చార్జింగ్ కు పట్టే సమయం విషయంలో ఆందోళనల కారణంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మారడం రైడర్‌లకు సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో బ్యాటరీని ఛార్జ్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) కోసం మౌలిక సదుపాయాలు అంతగా లేవు.
పూర్తిగా మేడ్-ఇన్-ఇండియా
వివేక్ రెడ్డి అమెరికాలో క్లౌడ్ కంప్యూటింగ్ పరిశ్రమలో తన కెరీర్‌ను వదిలేసి 2021 చివరిలో బ్రిస్క్‌ని ప్రారంభించారు. పూర్తిగా మేడ్-ఇన్-ఇండియా ద్విచక్ర వాహనాన్ని నిర్మించాలనే ఆలోచన అతన్ని ఎంతగానో ఆకర్షించింది, గత ఫిబ్రవరిలో జరిగిన హైదరాబాద్ ఈ-మోటార్ షోలో, బ్రిస్క్ EV తన అంతర్గత బ్యాటరీ సాంకేతికతను, మల్టిపుల్ బ్యాటరీ పరిష్కారాన్ని ప్రదర్శించారు. ఆతర్వాత హైదరాబాద్‌కు చెందిన వారు కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు ప్రతిభావంతుల నుండి అనేక ఉద్యోగ దరఖాస్తులను కంపెనీ స్వీకరించింది.
తాము నెలల తరబడి పరిశోధన చేశామని, ఐదు బృందాలను ఏర్పాటు చేసి స్వంత బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (BMS), వాహన నియంత్రణ యూనిట్ (VCU) ను అభివృద్ధి చేశామని వివేక్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రిస్క్ EV అంతర్గత సాంకేతిక అభివృద్ధికి సాయం అందిస్తోంది. హైదరాబాద్ లోని అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్, THub చొరవతో బ్రిస్క్ వేగంగా ముందుకు సాగుతోంది. తెలంగాణలో ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏ పరిశ్రమనైనా ప్రభుత్వం స్వాగతిస్తున్నదని అది ప్రోత్సాహకరంగా ఉందని రెడ్డి పేర్కొన్నారు.
ఉత్పత్తి ఎప్పుడు?
హైదరాబాద్‌కు చెందిన బ్రిస్క్ EV ఇప్పుడు ఈ ఏడాది చివర్లో ఉత్పత్తిని ప్రారంభించాలని చూస్తోంది. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న పారిశ్రామిక పార్కు అయిన మహేశ్వరంలో ఉంది. ఇది US$15 మిలియన్లను సేకరించే లక్ష్యంతో రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకుంది.