
మరో 6 నగరాలకు Bajaj Chetak electric scooter
రూ.2వేలతో బుకింగ్ బజాజ్ ఆటో కంపెనీ తన Bajaj Chetak electric scooter కోసం దేశంలోని ఆరు నగరాల్లో బుకింగ్‌లను పునఃప్రారంభించింది. అవి పూనే, బెంగళూరు, నాగపూర్, మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ నగరాల్లో ఇకపై బుకింగ్ చేసుకోవచ్చు. స్కూటర్ బుక్ చేయడానికి బజాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ను అందులో పొందుపరిచి ఆ తర్వాత మీ ఫోన్‌కు వచ్చే OTP ని నమోదు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ధ్రువీకరించాల్సి ఉంటుంది. పూర్తయిన తర్వాత, మీకు నచ్చిన నగరం, డీలర్, వేరియంట్ అలాగే చేతక్ స్కూటర్ యొక్క రంగును ఎంచుకోవాలి.ఈ ఆప్షన్లను ఎంపిక చేసుకున్న తరువాత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కంప్లీట్ ధర వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ మొత్తం రూ.2,000 గా నిర్ణయించారు.
Bajaj Chetak electric scooter
Bajaj Chet...