Friday, March 14Lend a hand to save the Planet
Shadow

Solar Energy

Solar power
New Solar power Plants
ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

Solar Energy
Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను ఏర్పాటు చేాయలని సూచించారు. సోలార్ కంపెనీల నుంచి వారంటీలతో కూడిన అధిక-నాణ్యత గల ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె సోలార్ పవర్ యూనిట్లకు సబ్సిడీలు అందించే ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం (మఫ్ట్ బిజిలీ యోజన) Pradhan Mantri Surya...
Green Energy | రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీకి ప్రణాళికలు..

Green Energy | రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీకి ప్రణాళికలు..

Solar Energy
Green Energy in Telangana | రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందని,  భవిష్య‌త్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2029-2030 వరకు  20,000 మెగా వాట్ల వరకు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక లను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ (Bhatti Vikramarka Mallu ) తెలిపారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీంతో విద్యుత్ వినియోగం  పెరుగుతున్నందున విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల‌ని అన్నారు.  అందుకు కావాల్సిన బడ్జెట్‌తో ముందుకు పోతున్నామని భట్టివిక్రమార్క తెలిపారు. ట్రాన్స్‌ఫార్మ‌ర్ల‌పై లోడ్ పడకుండా కావాల్సిన అదనంగా ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌ను  అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి  రైతులకు పంటతో పాటు కరెంటుతో ఆదాయం వచ్చేలా వ్యవసాయ పంపు స...
Solar news | పూర్తి సోలార్ గ్రామంగా ఖమ్మం జిల్లా సిరిపురం ఎంపిక.. ఇక అక్కడ విద్యుత్ చార్జీలు ఉండవు..

Solar news | పూర్తి సోలార్ గ్రామంగా ఖమ్మం జిల్లా సిరిపురం ఎంపిక.. ఇక అక్కడ విద్యుత్ చార్జీలు ఉండవు..

E-scooters, Solar Energy
Solar news | సుస్థిర ఇంధన విధానాలు, సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపిక చేశారు. టీజీ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, తెలంగాణ స్టేట్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీ ఆర్‌ఈడీసీఓ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల వావిళ్ల, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సురేందర్‌తో కలిసి గ్రామాన్ని ఇటీవల సందర్శించారు.ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామస్థులతో కలిసి వివరించారు. గ్రామంలో 1,039 మంది గృహ వినియోగదారులు, 520 మంది  వ్యవసాయ వినియోగదారులు (రైతులు) ఉన్నారు. కాగా గృహ వినియోగదారులకు సంబంధించి సర్వే పూర్తయింది. ఇప్పటివరకు దాదాపు 50 శాతం వ్యవసాయానికి సంబంధించి విద్యత్ వినియోగంపై  సర్వే చేశారు. మిగిలినవి వచ్చే మూడు రోజుల్లో పూర...
Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Solar Energy
Renewable Energy : గుజరాత్‌ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాముల‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్ర‌దాయ‌ విద్యుత్‌ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌ణాళికా బ‌ద్దంగా ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. ఈ సదస్సులో నాలుగు దేశాలు హాజరయ్యాయని వెల్ల‌డించారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం గాంధీనగర్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు.పునరుత్పాదక ఇంధన రంగం (Renewable Energy) లో భారత్‌ ప్రపంచానికి రోల్‌మాడ‌ల్‌గా నిల‌వ‌నుంద‌ని మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం సుమారు 208 గిగావాట్‌ పునరుత్పాదక ఇంధనాన్ని మ‌న‌దేశం ఉత్పత్తి చేస...
పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల ద‌ర‌ఖాస్తు..

పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల ద‌ర‌ఖాస్తు..

Solar Energy
PM Rooftop Solar Scheme | ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో సోమ‌వారం జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ (PM Modi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల ఇళ్లలో ఇన్‌స్టాలేషన్ పూర్తయింద‌ని, వారు ప్ర‌స్తుతం ఉచితంగా సోలార్ విద్యుత్ ను వినియోగించుకుంటున్నార‌ని, పేద‌ల ప్ర‌జ‌ల‌పై క‌రెంటు బిల్లుల భారం త‌గ్గిపోయింద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.PM Rooftop Solar Scheme ద్వారా త‌మ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్న‌ వినియోగదారులు తమకు అవ‌స‌ర‌మైన‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. అదనపు విద్యుత్‌...
Bhatti Vikramarka |  సోలార్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం..

Bhatti Vikramarka | సోలార్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం..

Solar Energy
Solar Power | తెలంగాణ రాష్ట్రం 2035 నాటికి 40 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన గ్రీన్ పవర్ ఎనర్జీ పెట్టుబడిదారుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సదంర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సోలార్ రంగం (Solar Power )లో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకురావాలని, హైదరాబాద్ లో అన్ని అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సమగ్ర ఇంధన విధానాన్ని అభివృద్ధి చేస్తోందని చెప్పారు.పెరుగుతున్న ఇంధన అవసరాలను సమతుల్యం చేయడం స్థిరత్వానికి మార్గమని తెలిపారు. తెలంగాణలో ఆర్టిఫిష...
Kondareddypalli | ఇక పూర్తి సోలార్ గ్రామంగా కొండారెడ్డిప‌ల్లి.. ఇంటింటి సర్వే షురూ..

Kondareddypalli | ఇక పూర్తి సోలార్ గ్రామంగా కొండారెడ్డిప‌ల్లి.. ఇంటింటి సర్వే షురూ..

Solar Energy
Kondareddypalli | రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న స్వ‌గ్రామ‌మైన కొండారెడ్డిప‌ల్లిని తెలంగాణ‌లోనే పూర్తిస్థాయి సోల‌రైజ్డ్ గ్రామంగా తీర్చ‌దిది్దాల‌ని నిర్ణ‌యించారు. ఈమేర‌కు సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలో కొండారెడ్డిప‌ల్లి గ్రామాన్ని మోడ‌ల్ సోలార్ విలేజ్‌గా చేసేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.మంగ‌ళ‌వారం టీజీఎస్పీడీసీఎల్ చైర్మ‌న్, ఎండీ ముషార‌ఫ్ ఫ‌రూఖీ, నాగ‌ర్‌క‌ర్నూల్ క‌లెక్ట‌ర్ సంతోష్‌, రెడ్కో వీసీ, ఎండీ అనిల‌, సంస్థ డైరెక్ట‌ర్ కె.రాములు, త‌దిత‌ర ముఖ్య అధికారులు.. కొండారెడ్డిప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు. గ్రామ‌స్తులు, రైతులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌తో అధికారులు మాట్లాడారు. ఈ పైల‌ట్ ప్రాజెక్టు వివ‌రాలు తెలిపారు.  కొండారెడ్డిప‌ల్లి గ్రామంలో సుమారు 499 గృహ వినియోగదారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేట‌గిరీలు అన్నీ కలుపుకుని మ...
Tata Power | దేశీయ సోలార్ రంగానికి మంచిరోజులు..  తమిళనాడు యూనిట్‌లో సోలార్ సెల్ ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా

Tata Power | దేశీయ సోలార్ రంగానికి మంచిరోజులు.. తమిళనాడు యూనిట్‌లో సోలార్ సెల్ ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా

Solar Energy
Tata Power | దేశీయ సోలార్ రంగానికి అతిపెద్ద ప్రోత్సాహం లభించింది. పెద్ద ఎత్తున సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి టాటా పవర్ కంపెనీ సిద్ధమైంది.  టాటా ప‌వ‌ర్ సోలార్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) భారతదేశంలోని అతిపెద్ద సెల్,మాడ్యూల్ తయారీ కంపెనీలలో ఒకటి. తాజాగా తమిళనాడు ప్లాంట్‌లో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది దేశంలో సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి అవసరమైన సెల్స్, మాడ్యూల్స్ దేశీయంగా ఉత్ప‌త్తిని పెంచుతుందని భావిస్తున్నారు.టాటా ప‌వ‌ర్ సోలార్ లిమిటెడ్ తిరునెల్వేలిలోని దాని తయారీ కేంద్రంలో 2GW సోలార్ సెల్ లైన్ నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశంలో అతిపెద్ద సింగిల్-లొకేషన్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్. ఈ సంవత్సరం ప్రారంభంలో సోలార్ మాడ్యూళ్ల విజయవంతంగా ఉత్పత్తిని ఆరంభించింది.2GW సామర్థ్యంతో ఉన్న ఈ సోల...
Solar Power Project | అసోంలో 25 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన

Solar Power Project | అసోంలో 25 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన

Solar Energy
Solar Power Project : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించే దిశగా అస్సాం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈమేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Assam Chief Minister Himanta Biswa Sarma)  దిబ్రూగఢ్ జిల్లాలోని నామ్‌రూప్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 25-మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అస్సాం పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ గా, ఈ ప్రాజెక్ట్ 108 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని వ్యయం రూ. 115 కోట్లు.ఆగస్టు 19, 2022న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ ఏటా 50 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేశారు. దీని నిర్మాణం జూలై 2025 నాటికి పూర్తవుతుంది. నామ్‌రూప్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ 2021లో తాను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..