
Tata Power | ఏపీలో టాటా పవర్ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు
టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో టాటా సంస్థ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం పెట్టుకుంది.ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం టాటా పవర్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దీని ద్వారా 7.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సైతం కొత్త బలం వస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రప్...