Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tea : రోజుకు 1 లేదా 2 కప్పుల టీ తాగడం మంచిది? అతిగా టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా?

Spread the love

How many cups tea drink in a day : మీరు కూడా టీ తాగడానికి ఇష్టపడుతున్నారా? మీరు ఒక రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారు? భారతీయులు టీ తాగడానికి చాలా ఇష్టపడతారు. చాలా మంది ప్రజలు రోజువారీ పనులను టీ తోనే మొదలవుతుంది. అదే సమయంలో, చలికాలం వస్తే, ఇక రోజంతా ఎన్ని కప్పుల టీలను సేవిస్తామో చెప్పలేం. అయితే ఆరోగ్యానికి హాని చేయని టీని రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా? . రోజులో ఎన్ని కప్పుల టీ తాగితే ఆరోగ్యానికి మంచిదో ఈ కథనంలో ఈరోజు తెలుసుకుందాం.

నిజానికి, టీ అనేది భారతీయ ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మాటా ముచ్చట సమయంలో లేదా సంతోషం కలిగినా,లేదా మానసికంగా ఎదైనా ఆందోళన కలిగించినా వెంటనే ఒక కప్పు టీ తీసుకుంటారు. కానీ టీ అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. . ఇది అనేక సమస్యలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు. . కాబట్టి రోజుకు ఎన్ని కప్పుల టీ తాగడం సరైనది, ఎక్కువసార్లు తాగడం ల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

టీ ఎక్కువగా తాగడం వల్ల ఈ సమస్యలు వస్తాయి
(What problems occur from drinking too much tea?)

గుండె మరియు నిద్రపై చెడు ప్రభావం:
టీలో కెఫిన్ ఉంటుంది. ఇది అధికంగా తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన. హృదయ స్పందన రేటు పెరుగుతుంది.

జీర్ణ సమస్యలు:
టీ ఎక్కువగా తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.

దంత సమస్యలు:
టీలో టానిన్ ఉంటుంది. ఇది దంతాల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

ఎముకల సమస్యలు:
టీ ఎక్కువగా తాగడం వల్ల క్యాల్షియం లోపం ఏర్పడి, ఎముకల సమస్యలు తలెత్తుతాయి.

నిద్ర లేమి
రాత్రిపూట ఎక్కువగా టీ తాగడం వల్ల నిద్ర రాకుండా చేస్తుంది. అలసిపోయినట్లు అనిపిస్తుంది.

బరువు పెరగడం:
చక్కెర లేదా క్రీమ్‌తో టీ తాగడం వల్ల కేలరీలు పెరుగుతాయి తద్వారా శరీర బరువు పెరిగే చాన్స్ ఉంది.

గుండె సమస్యలు:
కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె కొట్టుకోవడం పెరగడంతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది.

అలర్జీలు
కొందరు వ్యక్తులు టీలోని కొన్ని పదార్థాల వల్ల అలెర్జీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

రోజుకు ఎన్ని కప్పుల టీ తాగడం మంచిది?

How many cups tea drink in a day ? మీరు ఎక్కువగా టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించుకోవాలనుకుంటే.. టీని మితంగా తీసుకోండి.. అలాగే, హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి అనే విషయానికొస్తే .. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు 3 నుంచి 4 కప్పుల టీ తాగడం ఫర్వాలేదు. అయితే దీని కంటే ఎక్కువ ఆరోగ్యానికి హానికరమని గమనించాలి. .

గమనిక : ఈ వ్యాసంలో పేర్కొన్న విషయాలు విభిన్న సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఈ కథనంలో ఇచ్చిన సమాచారం సరైనదని వందేభారత్ క్లెయిమ్ చేయలేదు. ఏదైనా చికిత్స, సూచనను పాటించే ముందు దయచేసి డాక్టర్ లేదా నిపుణుడిని సంప్రదించండి.

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *