ఇండియాకు ElectronEV electric commercial vehicles (eCVs)
అమెరికాకు చెందిన కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ ఇండియాకు ElectronEV .. ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
US-ఆధారిత ElectronEV లైట్/మీడియం/ భారీ వాణిజ్య వాహనాలను ఇండయాలో విక్రయించి భారతీయ CV మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించింది. USలో ఈ కంపెనీ electric commercial vehicles (eCVs) (ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు)లతోపాటు బ్రాండ్ కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు, వెహికల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డిజిటల్ కాక్‌పిట్, IoT సొల్యూషన్స్, రియల్ టైమ్ డేటా అనలిటిక్ సొల్యూషన్‌లతో సహా తన సేవలను అందిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్‌కు తమ కంపెనీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.
భారతదేశం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా,యూరప్ వంటి మార్కెట్‌లకు EVలు అలాగే, ఎండ్-టు-ఎండ్ మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా దాని EV సాంకేతికతను పరిచయం చేయాలని ElectronEV భావిస్తోంది. ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో డెలివరీ వ్యాన్‌లు, ట్రక్కులు, బస్సులు ఉన్నాయి.
బ్యాటరీ సాంకేతికత పరిమితులు, అధిక మూలధన వ్యయం, EVల ధర, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత, స్మార్ట్, మాడ్యులర్, హెవీ డ్యూటీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి పట్టే సమయం వంటి సమస్యలు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి కంపెనీ యోచిస్తోంది.
ElectronEV వ్యవస్థాపకుడు రాకేష్ కోనేరు మాట్లాడుతూ, “భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల కోసం అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఎదుగుతోంది. అందుకే మా ఉత్పత్తులు భారతదేశంలోని B2B మరియు B2C విభాగాల డిమాండ్‌ను తీర్చగలవు అని పేర్కొన్నారు.
యునైటెడ్ స్టేట్స్‌లో నడుస్తున్న వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల సముదాయంలో నైపుణ్యం, అనుభవంతో, ElectronEV భారతదేశంలోని CEV (electric commercial vehicles) మార్కెట్లో తన ఉత్పత్తులతో స్థిరమైన మొబలిటీ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉందని చెప్పారు.
వాహన్ డేటా ప్రకారం, జూలై నెలలో మధ్యస్థ , భారీ వాణిజ్య వాహనాల విక్రయాలు 8,522 యూనిట్లుగా ఉన్నాయి, గత జూలైలో విక్రయించిన 5,416 వాహనాలతో పోలిస్తే 57 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 3,357 యూనిట్లతో పోలిస్తే తేలికపాటి వాణిజ్య వాహనాల విక్రయాలు 33 శాతం వృద్ధితో 4,475 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ క్యారియర్ సెగ్మెంట్ కూడా మూడు రెట్లు భారీ వృద్ధిని సాధించింది.