
EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది.
టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు 2023 మరియు 2025 మధ్య 4x వృద్ధిని సాధించాయి, మొత్తం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 5,500 నుండి 23,000 కు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, OEMలు, ఇతర థర్డ్ పార్టీ సొల్యూషన్ ప్రొవైడర్ల మధ్య పరస్పర సహకారంతో సాధ్యమైంది. ఇవి కేవలం 15 నెలల్లో 18,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఛార్జర్‌లను ఏర్పాటు చేశారు.
EV Chargers : హైవేలపై 50కి.మీలోపు ఫాస్ట్ చార్జర్లు
91% జాతీయ రహదారులు ఇప్పుడు 50 కి.మీ.ల లోపు ఫాస్ట్ ఛార్జర్‌ను కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, కేరళ, బీహార్, చండీగఢ్, పంజాబ్, గోవా, త్రిపుర, సిక్కిం, పుదుచ్చేరి, డామన్ & డయు, దాద్రా & నగర్ హవేలి వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని జాతీయ రహదారులపై 100% ఫాస్ట్-ఛార్జర్ కవరేజీని సాధించాయి. మరీ ముఖ్యంగా, టాప్ 25% ఛార్జర్‌లు ఇప్పటికే లాభదాయక వినియోగ స్థాయిలో పనిచేస్తున్నాయి.
వినియోగదారుల్లో మార్పు
ఛార్జింగ్ మౌలిక సదుపాయాల పెరుగుదల వినియోగదారుల ప్రవర్తనలో మార్పునకు దారితీసింది. జూలై 2025 నాటికి, 35% టాటా EV వినియోగదారులు నెలకు ఒకసారి కనీసం ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 2023లో 21%గా ఉంది. గత రెండు సంవత్సరాలలో దాదాపు 77% టాటా EV వినియోగదారులు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు యాక్సెస్ అవసరమయ్యే ప్రయాణాలు చేశారని నివేదిక పేర్కొంది. 50% టాటా EV యజమానులు 500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణాలు పూర్తి చేశారు, తద్వారా “రేంజ్(మైలేజీ) ఆందోళన”ని తొలగించారు.
దాదాపు 14,000 మంది యజమానులు తమ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రధానంగా పబ్లిక్ ఛార్జింగ్‌పై ఆధారపడుతున్నారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న వినియోగదారుల విశ్వాసాన్ని సూచిస్తుంది.
ఈవీలకు పెరుగుతున్న ఆదరణ
విస్తృతమైన చార్జింగ్ మౌలిక సౌకర్యాలతో వినియోగదారుల్లో కొత్త నమ్మకాన్ని సృష్టించాయి. ఇదే EV అమ్మకాలకు సహాయపడిందని నివేదిక సూచించింది. భారతదేశంలోని 65% పిన్ కోడ్‌లు ఇప్పుడు కనీసం ఒక రిజిస్టర్డ్ EVని కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది, ఇది దేశవ్యాప్తంగా EV స్వీకరణ పెరుగుదలను తెలియజేస్తుంది. 2023లో 74%తో పోలిస్తే 2025లో 84% మంది వినియోగదారులు EVలను తమ ప్రాథమిక వాహనంగా భావిస్తున్నారని నివేదిక పేర్కొంది.
తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా EVల యజమానులు నెలలో 27 రోజులు డ్రైవ్ చేస్తారు. ఇది ICE వినియోగదారుల కంటే 35% ఎక్కువ. సగటున, EVలు నెలకు 1,600 కి.మీ. నడుస్తాయి, ఇది ICE వాహనాల కంటే 40% ఎక్కువ. నేడు, EVలు భారతదేశ రోడ్ నెట్‌వర్క్‌లో 95% కవర్ చేస్తాయి, సుదూర ప్రయాణానికి సపోర్ట్ ఇస్తున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.