ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

cotton farmers
Spread the love


Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే సమయం వంటి ముఖ్యమైన వివరాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్సప్ నంబరు ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన ఈ వాట్సప్ యాప్ ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పత్తిని విక్రయించుకోవాలని రైతులను కోరారు. అలాగే, రైతులకు ఎటువంటి ఫిర్యాదు ఉన్నా వాట్సప్ ద్వారా సమాచారమిస్తే.. మార్కెటింగ్ శాఖ సత్వరమే చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల వివరించారు.

కాగా, రైతులు తీసుకువచ్చే పత్తిలో తేమ 12 శాతం మించకుండా ఉండాలని, 8% నుంచి 12% మధ్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుందని మంత్రి తుమ్మల వివరించారు. తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర లభిస్తుందని, రైతులు తమ పత్తిని పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం తగ్గిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. పత్తిని సులభంగా విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని తలెిపారు. రైతులందరూ వాట్సాప్ చాట్ ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పత్తిని అమ్ముకోవాలని రైతులను కోరారు.

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *