Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Electric Car | షారుక్ ఖాన్ వద్దకు చేరిన మొట్టమొదటి EV హ్యుందాయ్ IONIQ 5

Spread the love

హ్యుందాయ్ ఇండియా ఆల్-ఎలక్ట్రిక్ SUV Ioniq 5ని ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్- షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)’కి డెలివరీ చేసింది. హ్యుందాయ్‌తో 25 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని స్మరించుకుంటూ.. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ EV SUVని నటుడికి అందించింది. తమ బ్రాండ్‌పై షారూఖ్ ఖాన్ ఇచ్చిన సపోర్ట్ కు నమ్మకానికి ధన్యవాదాలు తెలిపింది..

భారతదేశంలో ఫ్యూచర్ మొబిలిటీ కి నాయకత్వం వహిస్తూ హ్యుందాయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో Ioniq 5ని విడుదల చేసింది. ఇప్పటికే 1,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. Ioniq 5 ప్రీమియం లగ్జరీ కార్లపై వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది.

కాగా ఈ కొరియన్ కార్‌మేకర్‌తో దాని బ్రాండ్ అంబాసిడర్‌గా షారూఖ్ ఖాన్ 25 సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగి ఉన్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV Ioniq 5ని భారతదేశంలో జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో- 2023లో షారుఖ్ ఖాన్ స్వయంగా విడుదల చేశారు .

IONIQ 5 అనేది భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ తరపున ఫ్లాగ్‌షిప్ కారు. దీని ధర రూ. 45.95 లక్షలు. ఇది ఇప్పటికే గత వారంలోనే 1,000 యూనిట్ల విక్రయాల మార్కును దాటింది. ఇప్పుడు ఈ బ్రాండ్.. SRKకి 1,100వ యూనిట్‌ను బహుమతిగా ఇచ్చింది. ఇది అతని కార్ల కలెక్షన్ లో మొట్టమొదటి EVగా నిలిచింది.

ప్రెజెంటేషన్ వేడుకలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ MD & CEO ఉన్సూ కిమ్ మాట్లాడుతూ.. “హ్యుందాయ్ గత 25 సంవత్సరాలుగా షారూఖ్ ఖాన్‌తో అనుబంధం కలిగి ఉంది. ఇది పరిశ్రమలో సుదీర్ఘ బ్రాండ్-అంబాసిడర్ భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది. SRK మొదటి హ్యుందాయ్ కుటుంబ సభ్యులలో ఒకరు. సంవత్సరాలుగా మా బ్రాండ్ విలువను మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ. “షారూఖ్ ఇప్పుడు మేము మా ఫ్లాగ్‌షిప్ EV- Ioniq 5ని అందించాము. హ్యుందాయ్‌లో ఆయన తిరుగులేని మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞులమై ఉంటాము. మా అనుబంధం చాలా సంవత్సరాలు కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

Shahrukh Khan ఏమన్నారు..?

తన కృతజ్ఞతలు తెలియజేస్తూ Shahrukh Khan ఇలా అన్నారు..  “ఇది నా మొట్టమొదటి EV. ఇది హ్యుందాయ్ అయినందుకు నేను సంతోషిస్తున్నాను. 2023 హ్యుందాయ్‌కి అలాగే నాకు కూడా నిజంగా విశేషమైనది. భారతదేశ ప్రజల నుంచి మేము పరస్పరం పొందిన ప్రేమ ఎంతో గొప్పది. హ్యుందాయ్ మోటార్ ఇండియా కుటుంబంలో అతి పెద్ద సభ్యుడిగా, మా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం నాకు మరియు బ్రాండ్‌కి నిజంగా ఫలవంతమైనది. మేము కలిసి కొన్ని అద్భుతమైన క్షణాలను పొందాము’ అని అన్నారు. ”

IONIQ 5 ప్రత్యేకతలు ఏమిటీ?

ఈ ఫ్లాగ్ షిప్ EV 72.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 631 కిమీల వరకు ప్రయాణించవచ్చు. ఇది ఒక బ్యాక్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 214 hp శక్తిని, 350 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తిచేస్తుంది. ఇది 150 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను కలిగి ఉంది. దీని సాయంతో కేవలం 21 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే 50 kW ఛార్జర్ తో గంటలో పూర్తి చార్జ్ అవుతుంది.

స్మార్ట్ ఫీచర్లు..

IONIQ 5 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదే సైజు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీటింగ్ సిస్టమ్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెహికల్-టు-లోడ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, అధునాతన భద్రతా వ్యవస్థలతో వస్తుంది. ఇది ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్, లేన్ ఫాలో అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మొదలైన హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ ADAS లెవెల్ 2 ఫీచర్లను కూడా కలిగి ఉంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *