Joy e-bike : ‘జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది.
ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్.. అలాగే తూర్పున బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో షోరూంలను కలిగి ఉండగా దక్షిణాన తమిళనాడులో షోరూంలు ఉన్నాయి.
ఇటీవల ప్రారంభించిన Joy e-bike షోరూమ్‌లలో MIHOSతో సహా లో స్పీడ్, హైస్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. MIHOS అనేది పాలీ డైసైక్లోపెంటాడైన్ మెటీరియల్ (PDCPD)ని ఉపయోగించే హై-స్పీడ్ ఇ-స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. ఇది రైడర్‌లకు అధిక మన్నిక, పనితీరును అందిస్తుంది.
కొత్త షోరూంల ప్రారంభోత్సవం సందర్బంగా వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీ చైర్మన్, MD యతిన్ గుప్తే మాట్లాడుతూ.. “మా అత్యాధునిక
షోరూంలలో అసాధారణమైన విక్రయాలు, నాణ్యమైన సేవా వనరుల ద్వారా మా కస్టమర్‌లకు చక్కని అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము.” అని తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.