Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు Kharif 2026 | రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం – మంత్రి తుమ్మల కీలక...

Kharif 2026 | రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం – మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

0
Kharif 2026 Seed Distribution Telangana

Kharif 2026 Seed Distribution Telangana | తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వానాకాలం (ఖరీఫ్) 2026 సాగు సన్నాహకాల్లో భాగంగా, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం మరియు నకిలీ విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టడంపై ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఖరీఫ్ 2026: ముఖ్యాంశాలు

  • Kharif 2026 సాగు అంచనా: రాష్ట్రంలో సుమారు 134.66 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉంది.
  • విత్తనాల లభ్యత: 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 38.21 లక్షల క్వింటాళ్ల నిల్వలు సిద్ధంగా ఉన్నాయి.
  • పత్తి విత్తనాలు: 52 లక్షల ఎకరాల పత్తి సాగు లక్ష్యంతో, 212.11 లక్షల ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.
  • సరఫరా: మే 15 నుండి విత్తనాల స్టాక్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీలను ఆదేశించారు.

Kharif 2026 : నకిలీ విత్తనాలపై ‘జీరో టాలరెన్స్’

నకిలీ విత్తనాల తయారీ, విక్రయాలపై మంత్రి తుమ్మల కఠిన హెచ్చరికలు జారీ చేశారు:

  • జిల్లా నుండి మండల స్థాయి వరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు.
  • రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను కట్టుదిట్టం చేసి, అక్రమ రవాణాను అరికట్టడం.
  • GOT ఫెయిల్ అయిన పత్తి విత్తనాలను పూర్తిగా నిషేధించడం.
  • విత్తన కంపెనీలు ప్రతి నెలాఖరులో స్టాక్ వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి.
  • కో మార్కెటింగ్ విధానంపై ఉన్న లోపాలను సవరించాలని, అవసరమైతే దానిని రద్దు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచన.

రైతులకు డిజిటల్ వెదర్ అలర్ట్స్

ఈ సమీక్షలో భాగంగా డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధులు మంత్రిని కలిశారు. రైతులకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం అందించేందుకు ప్రయోగాత్మక ప్రాజెక్టును వివరిస్తూ, SMS, WhatsApp ద్వారా రైతులకు సూచనలు అందించే విధానాన్ని వారు వివరించారు. ఈ ప్రాజెక్టు అమలుపై పరిశీలన జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, నాణ్యమైన విత్తనాల సరఫరాలో ఎలాంటి రాజీ పడకూడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.


Previous articleకేంద్ర మోటార్ వాహనాల నిబంధనల్లో భారీ మార్పులు: ఇథనాల్, హైడ్రోజన్, బయోడీజిల్‌కు ప్రాధాన్యం
Next articleOben Rorr Evo లాంచ్: రూ. 99,999కే సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ఫీచర్లు ఇవే!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here