220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter

Spread the love

Komaki DT 3000 electri oic scooter:

Komaki కంపెనీ మార్చి 25న త‌న హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki DT 3000 ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది.  ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. .
ఈ స్కూటర్ ను ప్రారంభించిన నాటి నుంచి అన్ని Komaki డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉండ‌నుంది. దీని ధర సుమారు రూ.1.15ల‌క్ష‌లు (. ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంద‌ని అంచ‌నా కాగా Komaki DT 3000 చిత్రాలను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు.

గంట‌కు 90కి.మి వేగం

Komaki కంపెనీ ఈ సంవ‌త్సం రేంజర్, వెనీషియన్ మోడ‌ళ్ల‌ను లాంచ్ చేసిన త‌ర్వాత మూడ‌వ మోడ‌ల్ DT 3000న కూడా లాంచ్ చేస్తోంది. ఈ కొత్త ఇ-స్కూటర్‌లో శక్తివంతమైన 3000 W BLDC మోటార్, పేటెంట్ పొందిన 62V52AH అధునాతన లిథియం బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని, గరిష్టంగా 90 కిమీ/గం వేగాన్ని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. Komaki DT 3000 electric scooter దాని రిజిస్ట్రేషన్ మోడల్ విభాగంలో బ్రాండ్ ఇది ఆరవ వెర్షన్.

మొట్ట‌మొద‌టి క్రూయిజ‌ర్.. రేంజ‌ర్‌

కొమాకి కంపెని ఈ సంవత్సరం ప్రారంభంలో త‌న మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ రేంజర్, అలాగే మరొక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వెనిస్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే.  రేంజర్ 5,000-వాట్ మోటార్‌తో జత చేయబడిన 4kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. EV ఒకే ఛార్జ్‌తో 250 కి.మీల దూరం పరిగెత్తగలదని, ఇది దేశంలోనే ఎక్క‌వ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలిచింది. Komaki Venetian 72v40ah బ్యాటరీ ప్యాక్, అదనపు స్టోరేజ్ బాక్స్‌తో వస్తుంది. ఇది రిపేర్ స్విచ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ స్విచ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

&nbsp
Komaki electric scooter

Komaki DT 3000 electric scooter మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.  ఈ స్కూట‌ర్‌పై కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ.. “మా కస్టమర్ల నుండి విపరీతమైన ప్రేమను అందుకున్న తర్వాత, మేము మరోసారి DT 3000 హై-స్పీడ్ స్కూటర్‌తో వారి హృదయాలను గెలుచుకోబోతున్నాము అని తెలిపారు.

Visit: Techtelugu  for tech news

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..