Lectrix EV : రూ.79,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జిపై 98కి.మీ మైలేజీ..

Spread the love

Lectrix EV LXS 2.0 electric scooter price in India : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో  ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది.  ఇందులో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. మరోవైపు ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడి సరికొత్త  ఈవీలనుమార్కెట్ లోకి వదులుతున్నాయి.  తాజాగా ఎస్​ఏఆర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ (SAR Electric Mobility) లో భాగమైన టూ వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్​ ఈవీ (Lectrix EV).. కొత్తగా LXS 2.0 పేరుతో ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ప్రారంభించింది.  ఈ మోడల్​ ఫీచర్స్​, రేంజ్​, ధర తదితర  వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

లెక్ట్రిక్స్​ ఈవీ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​..

లెక్ట్రిక్స్​ ఈవీ కంపెనీకి  మార్కెట్​లో.. ఇప్పటికే  ఎల్​ఎక్స్​ఎస్​ 3.0  ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. కొత్తగా  లాంచ్​ అయిన ఎల్​ఎక్స్​ఎస్​ 2.0.. దాని కింది సెగ్మెంట్ లో నిలుస్తుంది.  కొత్త Lectrix EV LXS 2.0 లో  2.3 kwh  ​ బ్యాటరీ ప్యాక్​,  బీఎల్​డీసీ హబ్​ మోటార్ఉం ఉంటుంది. దీని టాప్​ స్పీడ్​ గంటకు  60 కి.మీ​.  దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 98 కి.మీలు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.

Lectrix EV LXS 2.0 range : 25 లీటర్ల అండర్​ సీట్ బూట్ స్పేస్ ఉంటుంది.  ఫాలో-మీ హెడ్​ల్యాంప్​ ఫంక్షన్​, 90/100 ఫ్రెంట్​- 110/90 10- ఇంచ్​ టైర్ల​తో పాటు మరిన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మైలేజీతోపాటు  బిల్ట్ క్వాలిటీ, డబ్బుక తగిన విలువ కోసం చూసే వినియోగదారుల కోసం  తమ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 చక్కగా సరిపోతుందని  లెక్ట్రిక్స్​  ఈవీ కంపెనీ చెబుతోంది.

ఎస్​ఏఆర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ  ఎండీ, సీఈఓ క విజయ కుమార్​  మాట్లాడుతూ..  “వాల్యూ కోసం చూసే వినియోగదారుల  ఆలోచనలను మేము  అర్థం చేసుకోగలం. అందుకే  వారికి తగిన కొత్త ఈవీని తీసుకొచ్చాం. కొత్త -స్కూటర్​..  ఇన్నోవేషన్​, క్వాలిటీ విషయంలో మేం అస్సలు రాజీపడలేదు.” అని తెలిపారు.

లెక్ట్రిక్స్​ ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 ధర

Best electric scooter in India :  లెక్ట్రిక్స్​ ఎల్​ఎక్స్​ఎస్​ 2.0 ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర(ఎక్స్​షోరూం) రూ. 79,999.  బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి.  మార్చ్​లో డెలివరీలు మొదలవుతాయని  సమాచారం.   ఇక ఈ స్కూటర్​ కొనుగోలు దారులకు  3ఏళ్లు లేదా 3000 కి.మీల వరకు వారెంటీని ఇస్తోంది.  ఇందులో యాంటీ థెఫ్ట్​ సిస్టెమ్​ కూడా ఉండడం విశేషం.  ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్​ కూడా ఉంది.. డోర్​ స్టెప్​ సర్వీస్​ని కూడా అందిస్తామని కంపెనీ  చెబుతోంది.కాగా తన పోర్ట్​ఫోలియోలోని ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా 10వేలకుపైగా మందికి విక్రయించామని తెలిపింది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..