4-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటుూరుతో సహా 25 నగరాల్లో అందుబాటులోకి..
Matter Aera pre-bookings : ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Matter కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరా (Aera) ప్రీ-బుకింగ్ పై ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని 25 నగరాలు జిల్లాల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది. మే 17, 2023న ప్రీ-బుకింగ్ విండో తెరవనున్నారు. రూ.2వేల మొత్తంలో బుక్ చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరుతో సహా బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్, మదురై, ముంబై, నవీ- థానే, రాయగడ, పూణే, నాగ్‌పూర్, నాసిక్, అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, జైపూర్, ఇండోర్, ఢిల్లీ NCR, పాట్నా, లక్నో, కాన్పూర్, గౌహతి, కమ్రూప్, కోల్‌కతా, భువనేశ్వర్, కోర్ధా వంటి నగరాల్లో Matter Aera అందుబాటులో ఉంటుంది.
వినియోగదారులు మ్యాటర్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లేదా OTOలో Aeraని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. Matter Aera, భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్, రూ. 1.44 లక్షల ప్రీ-రిజిస్ట్రేషన్ ధరతో ప్రారంభమవుతుంది. వినియోగదారులు Aera 5000, Aera 5000+ మోడళ్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో తొలి E-bike
Matter Aera 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లిక్విడ్-కూల్డ్ 5kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ 6 సెకన్లలోనే 0 నుంచి 60kmph వరకు వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 125కిమీలకు ప్రయాణిస్తుంది. ఈ బైక్ ను 5-amp ఆన్‌బోర్డ్ ఛార్జింగ్ సిస్టమ్‌తో ఛార్జ్ చేయవచ్చు.
ఈ Electric bike లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డిస్క్ బ్రేక్‌లు, ఫోన్ కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సంప్రదాయ మోటార్‌సైకిల్ లో మాదిరిగా క్లచ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఇ-మోటార్‌సైకిల్ స్టార్ట్ చేసి నడిపించిన వెంటనే టచ్‌స్క్రీన్ క్లస్టర్ టచ్ కంట్రోల్ పనిచేయదని కంపెనీ పేర్కొంది. వాహనదారుడి భద్రత కోసమే ఈ ఫీచర్ ను తీసుకచ్చారు.
Matter గ్రూప్ CEO ఫౌండర్ మోహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ “భారతదేశంలోని మోటర్‌బైకర్లు 22వ శతాబ్దపు మోటర్‌బైక్ రైడ్స్నుఆస్వాదించే రోజు దగ్గరలోనే ఉంది. మేటర్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, OTO ద్వారా ఏరాను ప్రీ-బుక్ చేయడానికి మోటర్‌బైకర్లందరినీ స్వాగతిస్తున్నామని తెలిపారు.
👌👌👌