Harithamithra Telugu News

Home EV Updates Electric cars టెస్టింగ్ ద‌శ‌లో MG Comet EV

టెస్టింగ్ ద‌శ‌లో MG Comet EV

1
MG Comet EV
MG Comet EV

MG సంస్థ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ వాహనం MG Comet EV భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఇప్పుడు గురుగ్రామ్ (Gurugram) లో ఈ వాహ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

Comet EV స్పెసిఫికేష‌న్స్‌..

Comet EV ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనం. దీని ధర సుమారు రూ. 10 లక్షలు ఉండ‌వ‌చ్చు. భారతదేశంలో టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3 లకు గ‌ట్టిపోటీ ఇవ్వ‌నుంది. కామెట్ EV అనేది వులింగ్ ఎయిర్ EV రీబ్యాడ్జ్ వెర్షన్. ఇది భారతదేశంలో MG కంపెనీకి సంబంధించి రెండవ పూర్తి ఎలక్ట్రిక్ వాహ‌నంగా నిల‌వ‌నుంది. ఇది భారతదేశంలో ఏప్రిల్ 2023లో ప్రారంభిస్తార‌ని భావిస్తున్నారు.

MG కామెట్ 25kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంది. 38 bhp ఎలక్ట్రిక్ మోటారుతో ముందు చక్రాలను ఎన‌ర్జీని ఇస్తుంది. . కాంపాక్ట్ ఈ వాహ‌నాన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిమీ మైలేజీని క్లెయిమ్ చేస్తుంది. నివేదికల ప్రకారం MG ఎయిర్ చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రీమియం వాహ‌నంగా ఉంటుంది. దీని ధ‌ర రూ. 10ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా.

Previous articleTORK Motors మొట్ట‌మొద‌టి షోరూం లాంచ్‌.. ఎక్క‌డంటే..?
Next articleరికార్డుస్థాయిలో MG Motor వాహ‌నాల విక్ర‌యాలు
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here