Saturday, December 7Lend a hand to save the Planet
Shadow

TORK Motors మొట్ట‌మొద‌టి షోరూం లాంచ్‌.. ఎక్క‌డంటే..?

Spread the love

TORK Motors గుజరాత్‌లోని సూరత్‌లో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఫెసిలిటీ బైక్‌ల విక్ర‌యాలతోపాటు అమ్మకాల తర్వాత స‌ర్వీస్‌ల‌ను అందిస్తుంది. నానా వరచా ప్రాంతంలో ఉన్న ఈ డీలర్‌షిప్ సూరత్ నగరం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో TORK మోటార్స్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను తీర్చ‌నుంది.

కొత్త డీలర్‌షిప్ షోరూమ్ ప్రాంతంలో KRATOS-R మోటార్‌సైకిళ్లను డిస్ప్లే చేస్తుంది. సందర్శకులకు KRATOS-R ఎల‌క్ట్రిక్ బైక్‌ను స్వ‌యంగా ప‌రిశీలించుకోవ‌చ్చు. అవుట్‌లెట్ 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్క‌డ సేల్స్‌, అలాగే విక్ర‌యానంత‌రం స‌ర్వీస్‌లు అందించ‌నున్నారు.

దేశ‌వ్యాప్తంగా మ‌రో ప‌ది ఔట్‌లెట్లు

షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా TORK మోటార్స్ వ్యవస్థాపకుడు & CEO కపిల్ షెల్కే మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశం అంతటా మరో 10 అవుట్‌లెట్‌లను ప్రారంభించాలని భావిస్తున్నామ‌ని తెలిపారు. త‌మ‌ కస్టమర్‌ల నుండి KRATOS-R బైక్స్ అధిక డిమాండ్‌ను తీర్చడానికి, పూణేలోని చకాన్‌లో త‌మ‌ మొదటి మైక్రో ఫ్యాక్టరీని ప్రారంభించామ‌ని వివ‌రించారు. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను త్వరితగతిన డెలివరీ చేయడానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

కాగా టోర్క్ మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ KRATOS-R ను 2022లో విడుదల చేసింది. ప్రారంభించినప్పటి నుండి, కంపెనీ పెద్ద సంఖ్య‌లో బుకింగ్‌లను న‌మోదు చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలో సబ్సిడీ తర్వాత ఈ మోటార్‌సైకిల్ ఎక్స్ షోరూం ధ‌ర రూ.1.68 లక్షలుగా ఉంది. బుకింగ్స్ కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

KRATOS-R Electric bike Specifications

  • Torque (motor) 38 Nm
  • Max Power 7500 W
  • Continuous Power 4500 W
  • Motor IP Rating IP67
  • Drive Type Mid Drive Electric Motor
  • Fuel Type Electric

Brakes

  • Front Disc
  • Rear Disc
  • Top Speed 105 kmph

Range

  • Range 180 km/charge
  • Range (Eco Mode) 120 km/charge
  • Range (Normal Mode) 100 km/charge
  • Range (Sport Mode) 70 km/charge
  • Battery Capacity 4 kWh
  • Charging Time 4-5 hours
  • Fast Charging Yes
  • Turn Signal Lamp LED

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *