Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు రైతులకు మేలు చేసే ‘సన్న రకాల’పైనే ఫోకస్! – Fine Rice Varieties 2026

రైతులకు మేలు చేసే ‘సన్న రకాల’పైనే ఫోకస్! – Fine Rice Varieties 2026

0
Fine Rice Varieties 2026

వానాకాలం సాగుపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష:

వచ్చే వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో రైతులు సాగు చేసే వరి రకాలు (Fine Rice Varieties 2026) , విత్తనాల లభ్యత. మద్దతు ధర (MSP) కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, శాస్త్రవేత్తలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సచివాలయంలో ఈ రోజు వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. వ‌చ్చే ఖరీఫ్ సీజన్ కోసం అందుబాటులో ఉంచాల్సిన వరి రకాల ఎంపిక, విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై వ్యవసాయశాఖ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వ్యవసాయశాఖ అధికారులతో చ‌ర్చ‌లు జ‌రిపారు.

వ్యవసాయశాఖ అధికారులు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం BPT -5024, RNR-15048, HMT SONA, Jai Shreeram, KNM-1638, WGL-44, WGL 962,JGL 1798, మరికొన్ని సన్న రకాలను (Fine Rice Varieties 2026) సిద్ధం చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత సంవత్సరం 33 రకాల సన్న రకాలను అందుబాటులో ఉంచడం వలన రైతులు అమ్మకాల సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు, కొన్నింటికి బోనస్ కూడా రాకుండా ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు.

రైతు ఉత్సవాల్లో అవగాహన

ఈ సంవత్సరం అలాంటి సమస్యలు రాకుండా పరిమిత రకాలు, రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకాలు అందుబాటులో ఉంచాల‌న్నారు. సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకొని, రాష్ట్రం, కేంద్రం కొనుగోలు చేసే పరిమాణాల ఆధారంగా విత్తనాల సరఫరా ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుండి 9 వరకు జరిగే రైతు ఉత్సవాల కార్యక్రమంలో మే 4 వ తేదిన ఈ విత్తనాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 కల్లా ఎంపిక చేసిన విత్తన రకాలను రైతులకు సిద్ధంగా ఉంచాలని అధికారులకు అన్నారు. అధిక దిగుబడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలనే అందుబాటులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు.

Previous articleUrban Farming | నగరవాసులకు బంపర్ ఆఫర్: కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌పై ఉచిత శిక్షణ!
Next articleKharif Crop | రానున్న ఖరీఫ్‌లో ‘ఎల్ నినో’ ముప్పు
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here